డింపుల్ హయాతి.. లెగ్స్ అందాలతో క్రేజీ లుక్
ఇదిలా ఉంటే తాజాగా డింపుల్ హయాతి వైట్ కలర్ టీషర్టుతో డిఫరెంట్ ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంది.
టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న తెలుగమ్మాయి డింపుల్ హయాతి. ఈ బ్యూటీ గల్ఫ్ అనే సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. అయితే మొదటి చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. తరువాత తమన్నా, ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన అభినేత్రి2 సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ఆ మూవీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
గద్దలకొండ గణేష్ సినిమాల డింపుల్ హయాతి చేసిన ఐటెం సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఆ సాంగ్ తర్వాత యురేకా అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ అత్రాంగి రే సినిమాతో హిందీలోకి డింపుల్ హయాతి అడుగుపెట్టింది. తమిళంలో విశాల్ కి జోడీగా ఒక సినిమాలో నటించింది. తరువాత మాస్ మహారాజ్ రవితేజకి జోడీగా ఖిలాడీ చిత్రంలో ఆడిపాడింది.
ఈ మూవీలో డింపుల్ హయాతి బికినీ వేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. ఈ బికినీ ట్రీట్ తో గ్లామర్ రోల్స్ కి తాను సిద్దమనే సిగ్నల్స్ ఇచ్చింది. నెక్స్ట్ రామబాణం సినిమాలో గోపిచంద్ కి జోడీగా నటించే అవకాశం డింపుల్ హయాతికి వచ్చింది. ఈ చిత్రంలో ఆమె మంచి ఫన్ జెనరేట్ చేసే పాత్రలో కనిపించింది. ఈ మూవీ కమర్షియల్ గా డిజాస్టర్ కావడంతో డింపుల్ హయాతి పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు.
అయితే కమర్షియల్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ డింపుల్ హయాతి దగ్గర పుష్కలంగా ఉన్నాయని ఆమె ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఇన్ స్టాగ్రామ్ లో డింపుల్ రెగ్యులర్ గా తన గ్లామర్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇదిలా ఉంటే తాజాగా డింపుల్ హయాతి వైట్ కలర్ టీషర్టుతో డిఫరెంట్ ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంది. ఈ ఫోటోలకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కళ్ళతోనే డింపుల్ హయాతి కట్టిపడేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.