నయా మేకర్స్ ఫార్ములా మార్చేస్తున్నారే!
శేఖర్ కమ్ములా అంటే కాఫీ లాంటి సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తాం. కొరటాల శివ అంటే సెన్సిబుల్ కంటెంట్ ని గెస్ చేస్తాం.
శేఖర్ కమ్ములా అంటే కాఫీ లాంటి సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తాం. కొరటాల శివ అంటే సెన్సిబుల్ కంటెంట్ ని గెస్ చేస్తాం. ఇక సుకుమార్ అంటే స్టైలిష్ లవ్ స్టోరీ లేదా యాక్షన్ థ్రిల్లర్ గా భావిస్తాం. అనీల్ రావిపూడి అంటే తన మార్క్ మాస్ కంటెంట్ ని ఊహిస్తాం. కానీ ఈ నయా దర్శకులంతా ఇప్పుడు ఫార్ములా మార్చేసి నట్లు కనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే చాలా సంగతులే తెలుస్తున్నాయి.
శేఖర్ కమ్ములా చిత్రాలంటే ఎంతో కూల్ గా కాపీ తాగినట్లు ఉంటాయి. హింస..రక్తపాతం వంటివి ఎక్కడా ఉండవు. అలాంటి అంశాలున్న కంటెంట్ ని ఆయన తీసుకోరు. అన్నది నిన్నటి మాట. నేడు ఆయన పార్ములా మార్చినట్లు కనిపిస్తుంది. హీరోతో తుపాకులు..బాంబ్ లు..కత్తులు కటార్లు పట్టించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ధనుష్ 51వ చిత్రాన్ని కమ్ములా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇది ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే మాఫియా స్టోరీ. కూల్ గా ఉండే కమ్ములా నుంచి ఇలాంటి కంటెంట్ ఏమాత్రం ఊహించనదే. ఇక కొరటాల శివ అంటే సెన్సిబుల్ స్టోరీలోనే తనదైన మార్క్ యాక్షన్ జోడీస్తుంటారు. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ అలాంటివే. అయితే `దేవర`తో ఆయన రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ఓ కొత్త జోనర్ లోకి ప్రవేశించారు. యాక్షన్ ని నెక్స్ట్ లెవల్లోనే చూపిస్తున్నారు.
అలాగే `పుష్ప`తో స్టైలిష్ మేకర్ సుకుమార్ కూడా పంథా మార్చేసారు. ఓ కొత్త బ్యాక్ డ్రాప్..స్టోరీని ఎంచుకుని చేసిన `పుష్ప` ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియాలో ఆయనకు పేరు తీసుకొచ్చింది. జాతీయ అవార్డుతోనూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. దీంతో `పుష్ప-2` ని భారీ ఎత్తున ప్లాన్ చేసి ముందుకెళ్తున్నారు. ఇక అనీల్ రావిపూడి బాలయ్య తో తెరకెక్కించిన `భగవంత్ కేసరి` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తన మార్క్ కామెడీ ఉన్నా...కంటెంట్ పరంగా మార్పులు చూపించాడు. ఆ రకంగా నయా మేకర్లు అంతా తమ సక్సెస్ ఫార్ములాని పక్కనబెట్టి కొత్త జానర్లోనూ మెప్పించే ప్రయత్నం గొప్పదనే చెప్పాలి.