ఒత్తిడి ఎదుర్కోని ఒకే ఒక్క డైరెక్ట‌ర్!

మ‌రి ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కోని డైరెక్ట‌ర్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే నేను ఉన్నాను అంటూ అట్లీ ముందుకొచ్చాడు.

Update: 2024-12-20 14:30 GMT

పాన్ ఇండియాలో సినిమా తీయ‌డం అన్న‌ది ఎంత పెద్ద బాధ్య‌తతో కూడుకున్న ప‌నో చెప్పాల్సిన ప‌నిలేదు. స్క్రిప్ట్ ద‌శ నుంచి ప్ర‌తీ ద‌శ‌లోనూ ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతుంటాయి. హీరో, హీరోయిన్ , ఇత‌ర న‌టీన‌టులు ఎంపిక‌, టెక్నిక‌ల్ టీమ్ సెల‌క్ష‌న్. ఇదంతా అనుకున్నంత ఈజీ కాదు. అటుపై సినిమా సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత అస‌లైన ప్ర‌జెర్ మొద‌ల‌వుతుంది. రీజ‌న‌ల్ సినిమా విష‌యంలోనే ద‌ర్శ‌కులు ఎంతో ఒత్తిడికి గుర‌వుతుంటారు. సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత ఎన్నో ర‌కాల మార్పులు జ‌రుగుతుంటాయి.

అక్క‌డిక‌క్క‌డ కొన్ని ర‌కాల మార్పులు జ‌రుగుతుంటాయి. సీన్స్ విష‌యంలో మార్పులన్న‌ది ఎంతో ఒత్తికిడి గురి చేస్తుంది. చేసేది క‌రెక్టా? కాదా? అన్న సందేహాలెన్నో వెంటాడుతుంటాయి. రాజ‌మౌళి, సుకుమార్ లాంటి ద‌ర్శ‌కులే ఎన్నో సంద‌ర్భాల్లో ఒత్తిడికి గురైన‌ట్లు వెల్ల‌డించారు. పాన్ ఇండియా సినిమా అన్న‌ది త‌మ‌పై ఎంత‌టిని ఒత్తిడిని తీసుకొస్తాయి అన్న‌ది చెప్పుకొచ్చారు. అలాగే ప్ర‌శాంత్ నీల్ కూడా కేజీఎఫ్ చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కున్న‌ట్లు తెలిపారు. మ‌రి ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కోని డైరెక్ట‌ర్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే నేను ఉన్నాను అంటూ అట్లీ ముందుకొచ్చాడు.

తాను ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్ టేక‌ప్ చేసినా ఎలాంటి ఒత్తిడికి గురికాన‌ని తెలిపారు. చేసే ప‌నిని ఇష్ట ప‌డితే అలాంటి ఒత్తిడి ఉండ‌ద‌న్నారు. తాను ఏ ప‌నిచేసినా ఎంతో క్లారిటీతో ఉంటాన‌న్నారు. స్క్రిప్ట్ ద‌శ నుంచి క్లియర్ క‌ట్ గా ఉంటాడట‌. ఒక‌సారి సీన్ రాసిన త‌ర్వాత మ‌ళ్లీ దాన్నిలో ఎలాంటి మార్పులు లేకుండానే సినిమా ఉంటుం ద‌ని...సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత అక్క‌డ ఎలాంటి ఛెంజెస్ కూడా చేయ‌న‌న్నారు.

తాను క‌థ‌లో ఎలాంటి మార్పు కావాల‌నుకున్నా సెట్స్ కి వెళ్ల‌క ముందే ఆ ప‌ని పూర్తి చేస్తాన‌న్నారు. `జ‌వాన్` సినిమాతో షారుక్ ఖాన్ ని డైరెక్ట్ చేసిన‌ప్పుడు కూడా ఎలాంటి ఒత్తిడికి గురి కాలేద‌న్నారు. వచ్చే ఏడాది అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో సల్మాన్ ఖాన్ కూడా ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది అట్లీ ఆవ‌ర చిత్రం కావ‌డం విశేషం. ఇంత వ‌ర‌కూ అట్లీకి ఒక్క వైఫ‌ల్యం కూడా లేని సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News