రాజమౌళి మేడ్ ఇన్ ఇండియా.. ఎలా ఉండబోతుంది..?

ఈ సినిమాకు సమర్పకుడిగా ఉంటూనే మహేష్ తో తను చేయాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు రాజమౌళి

Update: 2023-09-20 13:30 GMT

రాజమౌళి నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే సినె లవర్స్ అంతా ఎంతో ఎగ్జైటింగ్ ఫీల్ అవుతారు. రీసెంట్ గా ఆయన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ అని చెప్పగానే మహేష్ తో చేసే సినిమా గురించి అనుకున్నారు. కానీ మేడ్ ఇన్ ఇండియా అంటూ ఒక సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఈ సినిమాకు రాజమౌళి సమర్పకుడిగా ఉంటుండగా తనయుడు కార్తికేయ నిర్మాణ భాగస్వామ్యం అవుతున్నాడు. నితిన్ కక్కర్ డైరెక్షన్ లో ఇండియన్ సినిమా బయోపిక్ గా మేడ్ ఇన్ ఇండియా రాబోతుంది.

100 ఏళ్ల ఇండియన్ సినిమా చరిత్ర కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇండియన్ సినిమా పుట్టిన దగ్గర నుంచి వేర్వేరు కాలాల్లో సినిమా మేకింగ్ కథల మార్పు ఇలా అన్నిటి మీద ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో ఆడియన్స్ డౌట్ ఏంటంటే సినిమా చరిత్రని సినిమాగా చూపిస్తే అంత ఆసక్తిగా ఉంటుందా.. ఇదేదో డాక్యుమెంటరీగా తీసి ఫిల్మ్ ఫెస్టివల్స్ కి అయితే ఓకే కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటుందా అని డౌట్ పడుతున్నారు.

రాజమౌళి మార్క్ పడింది అంటే అంతకుముందు ఎలా ఉన్నా జక్కన్న హ్యాండ్ పడ్డాక దాని ప్లానింగ్ మారిపోతుంది. రాజమౌళి కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతారని తెలుస్తుంది. ఇంతకీ ఈ సినిమాలో క్యాస్టింగ్ ఎవరు ఈ సినిమాకు టెక్నికల్ గా ఎవరెవరు పనిచేస్తున్నారు లాంటి విషయాలు తెలియాల్సి ఉంది.

ఈ సినిమాకు సమర్పకుడిగా ఉంటూనే మహేష్ తో తను చేయాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు రాజమౌళి. మహేష్ 29వ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉండేలా తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్. 2024 మొదట్లో మొదలయ్యే ఈ సినిమా 2026 లో రిలీజ్ చేయాలని ప్లాన్. ఆర్.ఆర్.ఆర్ తో ఇంటర్నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి మహేష్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా బిజినెస్ తోనే 1000 కోట్లు టార్గెట్ పెట్టుకున్న జక్కన్న సినిమా మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ పై కలెక్షన్స్ సునామి తెచ్చేలా చేయాలని చూస్తున్నారు. రాజమౌళి ఫిక్స్ అయ్యారు అంటే దానికి మించి జరుగుతుంది తప్ప తగ్గేది మాత్రం లేదని చెప్పొచ్చు.

Tags:    

Similar News