సౌత్ డైరెక్టర్స్.. నెక్స్ట్ బాక్సాఫీస్ సెంచరీ వీరితోనే..
సినీ ఇండస్ట్రీలో ఇదే నయా ట్రెండ్. మరి ఈ లిస్టులో ఎంతమంది డైరెక్టర్స్ చేరారు? రాబోయే రోజుల్లో ఇంకెంత మంది యాడ్ కాబోతున్నారనేది తెలుసుకుందాం..
పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక సినిమాల బడ్జెట్ తో పాటు కలెక్షన్స్ కూడా పెరిగిపోయాయి. ఒకప్పుడు రూ.50 కోట్లు పెట్టి సినిమా తీస్తేనే గగనం అనేవారు కానీ ఇప్పుడు రూ.100 కోట్లు, రూ.200కోట్లు, రూ 500కోట్లు.. ఇలా ఎంత అంటే అంత బడ్జెట్ పెడుతున్నారు. కలెక్షన్స్ కూడా అంతకుమించి వస్తున్నాయి. రూ.100 కోట్ల సినిమా అని చెప్పే రోజుల నుంచి ఫస్ట్ డే రూ.100 కోట్లు కొల్లగొట్టిన సినిమా అని చెప్పే రోజులొచ్చేసాయి.
ఇప్పుడు అగ్ర హీరోల సినిమాలు మొదటి రోజే వంద కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఇదే నయా ట్రెండ్. మరి ఈ లిస్టులో ఎంతమంది డైరెక్టర్స్ చేరారు? రాబోయే రోజుల్లో ఇంకెంత మంది యాడ్ కాబోతున్నారనేది తెలుసుకుందాం..
సౌత్ నుంచి ఫస్ట్ టైం ఫస్ట్ డే రూ.100 కోట్లు టచ్ చేసిన డైరెక్టర్ ఎస్. ఎస్ రాజమౌళి. బాహుబలి 2, 'RRR' సినిమాలతో జక్కన్న ఈ రేర్ ఫీట్ ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన దారిలోనే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, డైరెక్టర్ అట్లీ, సుజిత్, సందీప్ రెడ్డి వంగా వంటి యంగ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ నడుస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లోనూ మరికొందరు దర్శకులు ఈ ట్రెండ్ పై గట్టిగానే ఫోకస్ పెట్టారు.
వారిలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలతో మొదటి రోజే రూ.100 కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ తో 'దేవర' అంటూ ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న కొరటాల శివ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. ఇప్పటికే 'RRR' తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తో రూ.100 కోట్ల ఓపెనింగ్స్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అటు 'పుష్ప' తో భారీ సక్సెస్ అందుకున్న సుకుమార్ 'పుష్ప 2' తో మొదటి రోజే వంద కోట్ల ఓపెనింగ్స్ చూడాలన్నది అల్లు ఫ్యాన్స్ కోరిక.'పుష్ప2' పై పాన్ ఇండియా వైడ్ ఉన్న క్రేజ్ చేస్తుంటే బన్నీ ఫ్యాన్స్ కోరిక నెరవేరడం గ్యారెంటీ గానే కనిపిస్తోంది.
వీరితోపాటు టాలీవుడ్ నుంచి 'కల్కి' సినిమాతో నాగ్ అశ్విన్, కన్నడ నుంచి 'కాంతార చాప్టర్ 1' తో రిషబ్ శెట్టి ఈ రేస్ లో ఉన్నారు. ఇద్దరూ కేవలం పాన్ ఇండియా లెవెల్ లో కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో తమ సత్తా చాటాలని కసిగా పని చేస్తున్నారు. మొత్తంగా గ్రాండ్ స్కేల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలతో మొదటి రోజే రూ.100 కోట్లు కొల్లగొట్టాలన్న దర్శకుల కోరిక కచ్చితంగా నెరవేరే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.