పెదకాపు.. దర్శకుడికి ఇదొక్కటే హ్యాపీ పాయింట్

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు.. తెరపై నటులుగా కూడా రాణించారు.

Update: 2023-10-01 08:13 GMT

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు.. తెరపై నటులుగా కూడా రాణించారు. తమకంటూ సపరేట్ ఇమేజ్​ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడా జాబితాలోకి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా చేరిపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం పెద కాపు 1 సినిమా.

వివరాళ్లోకి వెళితే.. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల‌. కానీ ఆ త‌ర్వాత నుంచి దాన్ని కొనసాగించలేకపోయారు. ముకుంద, బ్ర‌హ్మోత్స‌వం చిత్రాలతో ఫ్లాప్​లను అందుకున్నారు. బ్ర‌హ్మోత్స‌వం చిత్రం అయితే.. మ‌హేశ్​ బాబు కెరీర్​లోనే బిగ్గెస్ట్​ డిజాస్ట‌ర్​గా నిలిచిపోయింది. దీంతో ఆయన రూట్ మార్చి.. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్​టైనర్​ రీమేక్ మూవీ నారప్ప‌ను డైరెక్ట్ చేశారు. ఇది పర్వాలేదనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తాజాగా ఇంటెన్స్​ కథ.. పెద‌ కాపు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా.. ప్రచార చిత్రాలతో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా.. బాక్సాఫీస్ బరిలో హవా చూపించలేకపోతోంది. స్కంద, చంద్ర‌ముఖి-2 లాంటి చిత్రాలతో పోటీ, పైగా సినిమాలో కొత్త హీరో కావడం వల్ల సినిమాకు పెద్దగా ఓపెనింగ్స్​ రాలేదు. అయినా ఓపెనింగ్ టాక్ కూడా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు లేదు. దీంతో రెండో రోజు నుంచి పుంజుకునే అవ‌కాశాలు తగ్గాయి.

కానీ ఈ చిత్రంతో దర్శకుడు శ్రీకాంత్ తన మార్క్ చూపించకోపోయినప్పటికీ.. న‌టుడిగా మాత్రం ఆక‌ట్టుకున్నారని అంటున్నారు. రావు ర‌మేష్ కొడుకు పాత్ర‌లో ఆయన నటన అద్భుతంగా ఉందని అంటున్నారు. కాళ్లు ప‌ని చేయ‌క‌పోయినా, పౌరుషానికి త‌క్కువ కాని ఓ పాత్ర‌లో శ్రీకాంత్​ యాక్టింగ్​, డైలాగ్స్​.. ప్రేక్ష‌కుల్లో బాగా ఆస‌క్తిని రేకెత్తించాయి. క్లైమాక్స్​ సీన్స్​లో కూడా ఆయన పాత్ర చెప్పే డైలాగులు బాగున్నాయట.

దీంతో ఇప్పటికే గతంలో దివంగత దాసరి సత్యనారాయణ, ప్రస్తుత జనరేషన్​లో త‌మిళంలో గౌత‌మ్ మేన‌న్, ఎస్.జె.సూర్య లాంటి చాలా మంది ద‌ర్శ‌కులు న‌టులుగా మారి కెరీర్​లో బిజీగా రాణిస్తున్నారు. ఇప్పుడు పెద‌కాపు రిజ‌ల్ట్​తో శ్రీకాంత్​ ద‌ర్శ‌కుడిగా కాకుండా.. న‌టుడిగా ట్రై చేస్తే బాగా క్లిక్ అవ్వొచ్చని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News