జైలు నుంచి పెళ్లికి...అధికారులు అనుమతిస్తారా?
కన్నడ నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో పరప్పన్ అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే
కన్నడ నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో పరప్పన్ అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గురువారంతో కస్టడీ ముగియడంతో విర్చువల్ గా కోర్టు ముందు ప్రవేశ పెట్టి విచారించగా రిమాండ్ ని ఆగస్టు 1వరకూ పొడిగించారు. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా విచారణలో మళ్లీ విఫలమే ఎదురైంది. అయితే ఈ రిమాండ్ ఖైదీని పెళ్లికి రావాలంటూ జెలుకెళ్లి మరీ ఆహ్వానించాడు దర్శకుడు తరుణ్ సుధీర్.
దర్శన్ ని కలిసిన సంద్భంగా తరుణ్ మీడియాతో మాట్లాడారు. ' దర్శన్ ఎప్పటిలాగే చిరు నవ్వుతో పలకరించారు. కానీ ఆయన ఆరోగ్యం కొన్ని రోజులుగా సరిగ్గా లేనట్లు తెలుస్తుంది. ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి అభిమానులందరికీ ఏదో కోల్పోయినట్లు ఉంది. నాకు పెళ్లి కుదిరిన సంగతి ఆయనకు ముందే తెలుసు. పెళ్లికి పిలిచాను. తన కోసం పెళ్లిని వాయిదా వేసుకోవద్దు అని చెప్పారు. ఆయన ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్ముతున్నాను. త్వరలోనో నిర్దోషిగా బయటకు వస్తారు.
నా పెళ్లికి తప్పక హాజరవుతారు' అని ధీమా వ్యక్తం చేసారు. దర్శకుడు తరుణ్ అదర్శ్ -నటి సోనాల్ మాంటెరియాను వివాహం చేసుకుంటున్నాడు. ఈ వివాహ వేడుకలు ఆగస్టు 10,11 తేదీల్లో జరుగు తున్నాయి. ఈ లోపు బెయిల్ వస్తే దర్శన్ హాజరయ్యే అవకాశం ఉంటుంది. జైలు అధికారులు పెళ్లికి వెళ్లేందుకు అనుమతులు ఇచ్చే రైట్ ఉందా? అన్నది తెలియాలి. రిమాండ్ ఖైదీ విషయంలో అధికారులు మరింత జాగ్రత్తగానూ వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇక దర్శన్-తరుణ్ కాంబినేషన్ లో 'కాటేరా', 'రాబర్ట్' చిత్రాలు తెరకెక్కాయి. తదుపరి 'సింధూర లక్ష్మణ' అనే సినిమా కూడా చేస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనా లున్నాయి. భారీ బడ్జెట్ తోనే ప్రాజెక్ట్ డిజైన్ చేసారు. కానీ దర్శన్ అరెస్ట్ తో అంతా తల్లకిందులైంది. ఆయన కమిట్ అయిన సినిమాలన్నీ ఆగిపోయిన పరిస్థితి వచ్చింది.