వర్మ దారిలో తేజ...ఇంకా ఎన్ని సారు?
ఆ మధ్య వర్మ ఏడాదికి పది సినిమాలను ప్రకటించే వాడు. అందులో ఒకటి రెండు కూడా పూర్తి చేసేవాడు కాదు. ఇప్పుడు తేజ కూడా అలాగే చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
దర్శకుడు తేజ పేరు చెప్పగానే ఆయన దర్శకత్వంలో వచ్చిన ట్రెండ్ సెట్టర్ లవ్ స్టోరీ సినిమాలు చిత్రం, జయం, జై గుర్తుకు వస్తాయి. పాతిక సంవత్సరాలు గడుస్తున్నా కూడా తేజ పేరు చెబితే అవే సినిమాల పేర్లు గుర్తుకు వస్తున్నాయి తప్ప కొత్తగా ఈయన చేసినవి పని చేయడం లేదు.
అహింస సినిమా తర్వాత తేజ ఏం చేసినా ప్రేక్షకులు చూసే పరిస్థితి లేదు అంటూ రివ్యూవర్స్ తేల్చి పారేశారు. అయినా కూడా తాను సినిమాలు చేయడం మానేది లేదు.. తన నుంచి వరుసగా సినిమాలు వస్తాయి అంటూ ప్రకటించాడు. ఆ మధ్య నేను రాజు నేనే మంత్రి సినిమా సీక్వెల్ అంటూ ప్రకటించాడు.
దర్శకుడు తేజ ఈ మధ్య కాలంలో పలు సినిమాలను ప్రకటించాడు. కానీ అందులో మొదలు పెట్టి పూర్తి చేసింది మాత్రం లేదు. ఆ మధ్య వర్మ ఏడాదికి పది సినిమాలను ప్రకటించే వాడు. అందులో ఒకటి రెండు కూడా పూర్తి చేసేవాడు కాదు. ఇప్పుడు తేజ కూడా అలాగే చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ మధ్య ఒకే సారి రెండు సినిమాలు చేస్తాను అంటూ ప్రకటించాడు. అందులో ఒకటి అలిమేలుమంగ వెంకటరమణ, రాక్షస రాజు రావణాసురుడు, చిత్రం 2, వెంకటేష్ తో ఆటా నాదే వేటా నాదే ఇలా చాలా సినిమాలను తేజ ప్రకటించాడు. కానీ అందులో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా సెట్స్ లోకి వెళ్లలేదు. ముందు ముందు ఇంకా ఎన్ని ప్రకటిస్తాడో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఆ మధ్య గోపీచంద్ తో ఈయన అలిమేలు మంగ వెంకటరమణ సినిమాను మొదలు పెట్టినట్లుగానే హడావుడి చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. చిత్రం 2 స్క్రీప్ట్ వర్క్ జరుగుతుందని వార్తలు వచ్చాయి. కానీ అది వర్కౌట్ అవ్వదని పక్కకు పెట్టేశాడు.
రానాతో చేస్తానంటూ చెబుతున్న రాక్షస రాజు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరు కూడా ఖాళీగానే ఉన్నారు కానీ ఆ సినిమాను మాత్రం మొదలు పెట్టడం లేదు. అసలు తేజ సినిమాల విషయంలో ఏం జరుగుతుందని ఆయన ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.