యువ దర్శకుడు భారీ స్టేట్మెంట్..!

అంతా కొత్త వాళ్లతో చేసిన ఈ సినిమాకు మెగా ప్రమోషన్స్ తో ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు

Update: 2024-08-08 08:00 GMT

సినిమాపై అది తీసిన డైరెక్టర్ పై నమ్మకం ఉండటం అనేది చాలా కామన్. ఐతే ఆ నమ్మకాన్నే తన పనిలో చూపించి తెర మీద అద్భుతాన్ని ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఐతే యువ దర్శకుడు ఒకరు తను తీసిన సినిమా ప్రతి కుర్రాడి బయోపిక్ అని చెప్పి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిహారిక కొణిదెల సమర్పణలో యధు వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కమిటీ కుర్రాళ్లు. ఆఫ్టర్ లాన్ గ్యాప్ నిహారిక నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

అంతా కొత్త వాళ్లతో చేసిన ఈ సినిమాకు మెగా ప్రమోషన్స్ తో ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే ఈ సినిమా డైరెక్టర్ మాత్రం తన స్టేట్మెంట్ తో అందరిని సర్ ప్రైజ్ చేశాడు. తన లైఫ్ లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా కమిటీ కుర్రాళ్లు కథ రాసుకున్నానని చెప్పిన యదు వంశీ ఈ సినిమా ప్రతి కుర్రాడి బయోపిక్ అనేశాడు. అంటే కుర్ర తనంలో ప్రతి ఒక్కరు చేసే పనుల సారాంశమంతా ఈ సినిమాలో ఉంటుందని హింట్ ఇచ్చాడు.

ఊళ్లో పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు జరిగిన పంచాయతీ నేపథ్యంతో ఈ సినిమా కథ నడుస్తుంది. అంతే ఈ సినిమా కథ పట్టుకుని చాలా ప్రొడక్షన్స్ కి వెళ్లా ప్రీ ప్రొడక్షన్ టైంలో కూడా సినిమా తాను తీయగలనా అన్న అనుమానంతో వెనక్కి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయని అన్నాడు యదు వంశీ. ఐతే నిహారిక మాత్రం తనకు సపోర్ట్ గా ఉంటూ సినిమాకు అవసరమైన బడ్జెట్ ఇచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూశారని చెప్పుకొచ్చాడు.

కమిటీ కుర్రాళ్లు ప్రచార చిత్రాల సందడి బాగానే ఉన్నా అందరు కొత్త వాళ్లు అవ్వడం వల్ల ఆడియన్స్ కాస్త రిజిస్టర్ చేసుకోవడం కష్టమవుతుంది. ఐతే ఈమధ్య కంటెంట్ ఉన్న సినిమా వస్తే అందులో నటించింది మనకు తెలియని వారైనా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి అదే క్రమంలో కమిటీ కుర్రాళ్లను కూడా ఆదరిస్తారేమో చూడాలి. సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయితే మాత్రం కుర్రాళ్లు హిట్ కొట్టినట్టే లెక్క. సినిమా మీద డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తుంది. ఐతే డైరెక్టర్ చెప్పినట్టుగా సినిమా నిజంగానే అలా ఉంటుందా లేదా అన్నది శుక్రవారం తెలుస్తుంది. సినిమా రిజల్ట్ పై మెగా డాటర్ నిహారిక కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News