వీరమల్లు.. ఆ లెజెండరీ యాక్టర్ రోల్ ఏంటి?

ఇండస్ట్రీ సర్కిల్ లో మాత్రం అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ గురించి ఇంటరెస్టింగ్ చర్చ నడుస్తోంది.

Update: 2024-08-11 04:40 GMT

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నారు. అందులో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా తెరకెక్కుతున్నవి కావడం విశేషం. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు జ్యోతిక్రిష్ణ ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నాడు. అయితే ఈ మూవీని ప్రారంభించి రెండేళ్లకి పైనే అయ్యింది. అయితే ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా హరిహరవీరమల్లు షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది.

ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ మరో 20-25 రోజుల కాల్ షీట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట. ఈ విషయాన్ని ఏ.ఎం.రత్నం చెప్పారు. మూవీ దర్శకత్వం నుంచి క్రిష్ అయితే తప్పుకున్నారు. ఈ విషయాన్ని కూడా నిర్మాత దృవీకరించారు. జ్యోతికృష్ణ మిగిలిన షూటింగ్ పార్ట్ మొత్తం తెరకెక్కిస్తారని క్లారిటీ ఇచ్చారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందనే నమ్మకంతో ఏ.ఎం.రత్నం ఉన్నారు.

అయితే ఆయన ఎప్పుడు కాల్ షీట్స్ ఇస్తారనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పాన్ ఇండియా స్టార్, లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. అయితే అతను సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇండస్ట్రీ సర్కిల్ లో మాత్రం అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ గురించి ఇంటరెస్టింగ్ చర్చ నడుస్తోంది.

హరిహర వీరమల్లులో అతని పాత్ర కథని లీడ్ చేసే విధంగా ఉంటుందంట. మూవీలో హైలైట్ గా ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసారంట. కచ్చితంగా అనుపమ్ ఖేర్ ఎంట్రీ హరిహర వీరమల్లు సినిమాని పాన్ ఇండియా లెవల్ లో అదనపు మైలేజ్ తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నారు. బాలీవుడ్ లో కూడా మూవీకి మంచి మార్కెట్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందంట. ఈ నటుడు ఇప్పటికే కార్తికేయ 2 సినిమాతో తెలుగు వారికి దగ్గరయ్యారు.

అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసింది. వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం అయితే హరిహరవీరమల్లు చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు షూటింగ్ కోసం డేట్స్ కేటాయిస్తారు అనేదానిని బట్టి ఈ మూవీ రిలీజ్ ఆధారపడి ఉంటుంది. ముందుగా హరిహరవీరమల్లు కంప్లీట్ చేస్తే డిసెంబర్ ఆఖరుకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News