CK బ్రాండ్‌తో ఎన్ని కోట్లు సంపాదించింది?
ప్రతిసారీ ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని వివాదాస్పద ఫోటోషూట్లతో అగ్గి రాజేసి మొత్తానికి దిశా పటానీ సీకే ఉత్పత్తికి బోలెడంత ప్రచారం చేసి పెట్టింది.
కరోనా కంటే ముందు నుంచే దిశా పటానీ సీకే బ్రాండ్ కి ప్రమోషన్ చేస్తోంది. 2020 దీపావళికి మొదటిసారి కెల్విన్ క్లెయిన్ (సీకే) లోదుస్తులు ధరించి దీపారాధన చేస్తున్న ఫోటోలు నెట్ లో సంచలనం సృష్టించాయి. లక్ష్మీ దేవి వస్తుందనుకుంటే సీకే (న్యూ*) దేవి వచ్చిందంటూ వాపోయారు కొందరు సాంప్రదాయ వాదులు. కానీ ఆ జిమ్మిక్ సీకే బ్రాండ్ ప్రచారానికి పెద్ద రేంజులో వర్కవుటైంది. యూత్ కి బ్రాండ్ ని ఒక రేంజులో కనెక్ట్ చేయడంలో దిశా పెద్దగా సక్సెసైంది. ప్రతిసారీ ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని వివాదాస్పద ఫోటోషూట్లతో అగ్గి రాజేసి మొత్తానికి దిశా పటానీ సీకే ఉత్పత్తికి బోలెడంత ప్రచారం చేసి పెట్టింది.
అయితే నాలుగేళ్లుగా దిశా పటానీని సీకే బ్రాండ్ కొనసాగిస్తోందంటే దానర్థం.. ఆ బ్రాండ్ విలువను అమాంతం పెంచగలిగే సత్తా ఉన్న ఏకైక తార దిశా మాత్రమేనని గ్రహించడం వల్లనే. అయితే ఇన్నేళ్లలో ఈ ఒక్క బ్రాండ్ తో దిశా పటానీ ఎంత సంపాదించి ఉంటుంది? అంటూ రకరకాల సందేహాలు పుట్టుకొస్తున్నాయి యూత్ కి.
ఓవైపు సినిమాలు చేస్తూనే బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న దిశా పటానీ ఇప్పటికే సుమారు 60 కోట్ల సంపదలతో ఫోర్బ్స్ జాబితాలోను చేరింది. ఇటీవలే బ్లాక్‌బస్టర్ కల్కి 2898 ADలో చివరిగా కనిపించింది. దీనికోసం కోట్లలో పారితోషికం అందుకుంది. తదుపరి కల్కి 2లోను తన పాత్రకు స్కోప్ ఉంటుంది. తదుపరి మరో పాన్ ఇండియా ఇత్రం కంగువతో అభిమానుల ముందుకు రానుంది. కంగువ నవంబర్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ శుభ సమయాన దిశా పటానీ తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో హీటెక్కిస్తోంది.
ఇంతలోనే సీకే బ్రాండ్ కి ప్రచారంలోను దిశా నిమగ్నమైంది. స్పోర్ట్స్ స్టార్లను సైతం ఆకర్షించేలా స్పోర్టివ్ డిజైనర్ లుక్కులతో కట్టి పడేసింది దిశా. ముఖ్యంగా సీకే టాప్ .. సీకే బ్రాండ్ బాటమ్ ని ఎలివేట్ చేస్తూ దిశా ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.