జెట్ ఫైటర్ అవ్వాలనుకున్న హీరోయిన్!
అటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా లేదు. మునుపటి కంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది
ఫిట్ నెస్ ప్రీక్ దిశా పటానీ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు బాలీవుడ్.. టాలీవుడ్..కో లీవుడ్ అంటూ మూడు భాషల్ని దున్నస్తుంది. ఇటీవలే `కల్కి 2898` తో పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగు పెట్టింది. అమ్మడికి తొలి పాన్ ఇండియా సినిమా మంచి ఐటెంటిటీని తెచ్చి పెట్టింది. తదుపరి `కంగువా`తోనే అలరించడానికి రెడీ అవుతోంది. ఇందులో సూర్య సరసన నటించడంతో! సౌత్ లో దిశ రేంజ్ మారిపోతుంది? అన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.
అటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా లేదు. మునుపటి కంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. అయితే సినిమాల్లోకి రావడం వల్ల తన డ్రీమ్ ని మాత్రం త్యాగం చేయాల్సి వచ్చిందని తెలిపింది. సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదుట. అనుకోకుండా ఈ రంగం వైపు వచ్చినట్లు తెలిసింది. ఇంట్లో అంతా ప్రభుత్వ ఉద్యోగులు అట. తండ్రి పోలీస్ అధికారి కాగా, తల్లి హెల్త్ డిపార్ట్ మెంట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారుట.
ఇక బ్రదర్ లెప్ట్ నెంట్ కల్నల్. అతడి స్పూర్తితోనే దిశ కూడా దేశ సేవలో భాగమవ్వాలనుకుందిట. దీనిలో భాగంగా ఆర్మీలో ఫైటర్ జెట్ లను నడిపే పైలెట్ అవ్వాలనుకుందిట. అందుకు అవసరమైన శిక్షణ కూడా తీసుకుందిట. అలాగే రాత పరీక్షకు సంబంధించి సన్నధం కూడా అయిందిట. కానీ కెరీర్ తాను అనుకు న్నట్లు జరగకపోవడంతో నటిగా మారాల్సి వచ్చిందని తెలిపింది.
తానంత ఫిట్ గా ఉండటానికి కారణంగా చిన్నప్పటి నుంచి ఉన్న క్రమ శిక్షణ కారణం అంటోంది. క్రమం తప్పకుండా ఫిటెనెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతోనే దేశం మీద కూడా ప్రేమ పెరిగిందిట. అలా పుట్టిన ఆలోచన పైటర్ జెట్. కానీ నటి అవ్వడంతో ఆ డ్రీమ్ ని త్యాగం చేయాల్సి వచ్చిందని తెలిపింది.