దిశా ప‌టానీని ఇలా ఎప్పుడూ చూసి ఉండ‌రు!

దిశా ఈ ఫోటోషూట్‌లో ఆయిలీ అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది. టోన్డ్ బాడీ, ప‌ర్ఫెక్ట్ ఫిట్ అందాల‌కు త‌గ్గ‌ట్టు టోన్డ్ లెగ్స్ సౌంద‌ర్యాన్ని దిశా ఈ ఫోటోషూట్ లో ఆవిష్క‌రించింది.

Update: 2024-08-09 17:27 GMT
దిశా ప‌టానీని ఇలా ఎప్పుడూ చూసి ఉండ‌రు!
  • whatsapp icon

దిశా ప‌టానీని ఇలా ఎప్పుడూ చూసి ఉండ‌రు! ఫ్యాషనిష్ఠా కొత్త‌ అవ‌తారం ఇప్పుడు ట్రెండీ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు సీకే బ్రాండ్ ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడ‌గొట్టిన దిశా ఇప్పుడు స‌రికొత్త ట్రెండీ అవ‌తార్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఈ బ్యూటీ తాజా లుక్ వైర‌ల్ గా దూసుకెళుతోంది.

 

నిజానికి ఇది రెగ్యుల‌ర్ ఫ్యాషన్ ఎంపిక కానే కాదు. సంథింగ్ స్పెష‌ల్ సెలెక్ష‌న్ అని పొగిడేయాల్సిందే. దిశా ప‌టానీ కొన్నేళ్లుగా ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ ఇన్న‌ర్ లు ధ‌రించి వెబ్ లో హీట్ పుట్టించేది. అందుకు భిన్నంగా ఇప్పుడు ఒక చినుగుల డిజైన‌ర్ ఫ్రాకులో క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ని యువ‌త‌రం వైర‌ల్ గా షేర్ చేస్తోంది. దిశా ఈ ఫోటోషూట్‌లో ఆయిలీ అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది. టోన్డ్ బాడీ, ప‌ర్ఫెక్ట్ ఫిట్ అందాల‌కు త‌గ్గ‌ట్టు టోన్డ్ లెగ్స్ సౌంద‌ర్యాన్ని దిశా ఈ ఫోటోషూట్ లో ఆవిష్క‌రించింది.

 

అయితే ఈ డిజైన‌ర్ లుక్ చూడ‌గానే..... దిశాను అలా చినిగిన గోనె సంచుల‌తో చుట్టేశారేమిటీ? అంటూ మాస్ అభిమానులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రోవైపు దిశా కోస్టార్ ఎల్లీ అవ్ రామ్ ఈ లుక్ స్ట‌న్నింగ్ అంటూ ప్ర‌శంసించారు.

 

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'క‌ల్కి 2989 ఏడి'లో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించింది. ఈ భారీ చిత్రంలో గెస్ట్ రోల్ లో క‌నిపించిన దిశా, త‌దుప‌రి సూర్య కంగువ‌లోను క‌నిపించ‌నుంది. హిందీలో కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ వెల్‌కమ్ టు ది జంగిల్ లో దిశా ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. వ‌ర్షాల కార‌ణంగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంత‌కంత‌కు ఆల‌స్య‌మైంది. ఆగస్ట్ 9 నుంచి త‌దుప‌రి చిత్రీకరణ పునఃప్రారంభం కానుంది. అక్ష‌య్ కుమార్, సునీల్ శెట్టి, రవీనా టాండన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స‌హా దిశా పటానీ ఇందులో న‌టిస్తున్నారు.

 

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సంజయ్ దత్, సునీల్ శెట్టి, అర్షద్ వార్సీ, పరేష్ రావల్, జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కృష్ణ అభిషేక్, కికు శారదా, దలేర్ మెహందీ, మికా సింగ్, రాహుల్ దేవ్, ముకేష్, రాహుల్ దేవ్ వంటి ప్రతిభావంతులు న‌టిస్తున్నారు. ఈ చిత్రం 20 డిసెంబర్ 2024న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.

Tags:    

Similar News