హీరోయిన్ సిస్టర్ ని చిన్నచూపు చూసిన సమాజం!
యంగ్ బ్యూటీ దిశాపటానీ గురించి పరిచయం అవసరం లేదు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది
యంగ్ బ్యూటీ దిశాపటానీ గురించి పరిచయం అవసరం లేదు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది. హీరోయిన్ అవ్వడం అన్నది తన కల కాకపోయినా వాళ్ల మమ్మీ కోసం నటి అయి ఆమె కలని ఈమె నెరవేర్చింది. మరి ఆ ఛాన్స్ దిశపటానీనే ఎందుకు తీసుకుంది? మరో కుమార్తె ని సినిమాల్లోకి ఎందుకు తీసుకురాలేదు? అంటే దిశా పటానీ వాళ్ల అక్క గురించి ఆసక్తిర సంగతులు చెప్పుకొచ్చింది.
'దిశపటానీ సిస్టర్ ఆర్మీ ఆఫీసర్. ఆ ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం. కష్టపడి ఆ ఉద్యోగం సంపాదించింది. అందుకోసం చాలా రకాల అవమానాలే ఎదుర్కుంది. మాది ఉత్తరప్రదేశ్ లోని బరేలి. మా ప్రాంతంలో ఆడపిల్లల్ని చిన్నచూపు చూసేవారు. ఇంట్లో నాన్న ఎంత బాగా చూసుకున్నా బయట ఇబ్బందిగానే ఉండేది. ఆర్మీ ఆఫీసర్ అవ్వడానికి పలు అంశాల్లో శిక్షణ తీసుకునేది. ఆ సమయంలో బంధువులు..తెలిసిన వాళ్లు రకరకాల మాటలు అనేవారు. అవేమి పట్టించుకోకుడా లక్ష్యం మీదనే దృష్టి పెట్టింది.
ఆర్మీ లెప్ట్ నెంట్ గా ఉద్యోగం సంపాదించింది. నచ్చిన పని చేయడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా దైర్యంగా..మొండిగా ముందుకెళ్లాలి. అప్పుడే సక్సెస్ అయ్యేది. ఎక్కడా ఆగకూడదని అక్కని చూసే నేర్చుకున్నా. నేను సినిమాల్లో సక్సెస్ అయ్యానంటే కారణం అక్క స్పూర్తితోనే' అని తెలిపింది.
ఇక దిశాపటానీ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. హిందీతో పాటు సౌత్ లోనూ సినిమాలు చేస్తోంది. 'కంగువా'..'కల్కి 2898' లాంటి సినిమాలతో పాటు పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతుంది. అమ్మడి కెరీర్ లో ఈ రెండు ఎంతో ప్రత్యేకమైన సినిమాలు కూడా . ఇంత పెద్ద ప్రాజెక్ట్ ల్లో ఇంతవరకూ నటించింది లేదు. తొలిసారి ఆ తరహా ఛాన్స్ అందుకున్న యువ నాయికగా ఐడెంటిటీ దక్కించుకుంది. 'కంగువా' అయితే ఏకంగా ప్రపంచ దేశాల్లో 38 భాషల్లోనే రిలీజ్ అవుతోంది.