బాలీవుడ్‌ హీరోయిన్ టాటూ.. ప్రభాస్ ఫ్యాన్స్ హడావిడి

ప్రభాస్ బాహుబలి సినిమాకు ముందు కేవలం టాలీవుడ్‌ హీరో. ఎప్పుడైతే బాహుబలి తో వచ్చాడో అప్పటి నుంచి పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌

Update: 2024-07-02 06:44 GMT

ప్రభాస్ బాహుబలి సినిమాకు ముందు కేవలం టాలీవుడ్‌ హీరో. ఎప్పుడైతే బాహుబలి తో వచ్చాడో అప్పటి నుంచి పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌. బాహుబలి, సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్, సలార్‌ ఇలా ప్రతి ఒక్క సినిమా బాలీవుడ్‌ లో ఏ స్థాయి సందడి చేశాయో మనం చూశాం.

ఇప్పుడు కల్కి సినిమా హిందీ సినిమాలను మించిన వసూళ్లు సాధిస్తున్న విషయం చూస్తున్నాం. బాలీవుడ్‌ లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ను దక్కించుకున్న ప్రభాస్‌ హిందీ స్టార్స్‌ కి కూడా డార్లింగ్‌ గా నిలిచాడు. ఎంతో మంది బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కి ప్రభాస్ అంటే పిచ్చి అభిమానం. ఆ విషయాన్ని చాలా మంది ఇప్పటికే వెల్లడించారు.

ప్రభాస్‌ చేస్తున్న ప్రతి సినిమాల్లో కూడా బాలీవుడ్‌ స్టార్స్ ను చూస్తున్నాం. సాహో సినిమాలో శ్రద్ద కపూర్ నటించింది. ఆ సమయంలో ప్రభాస్ అంటే శ్రద్ద ఆసక్తి చూపిస్తుందని, ఆమె ప్రేమలో ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. ఆదిపురుష్ సమయంలో కూడా అలాంటి పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేశాయి. కృతి శెట్టి తో పెళ్లి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్లి పోయారు.

ఇప్పుడు దిశా పటానీ గురించి అలాంటి చర్చ జరుగుతోంది. ఇటీవల దిశా పటానీ చేతిపై "PD" అనే అక్షరాలను టాటూ గా వేయించుకుంది. ఆ టాటూను చూసిన చాలా మంది ఆ అక్షరాలకు అర్థం కచ్చితంగా ప్రభాస్ డార్లింగ్‌ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు.

Read more!

దిశా పటానీ ఇటీవల కల్కి సినిమా కోసం ప్రభాస్ తో కలిసి వర్క్‌ చేసింది. ఆమె కనిపించింది కొద్ది సమయం అయినా కూడా ఆకట్టుకుంది. ప్రభాస్‌ మరియు దిశా పటానీ జోడీ బాగుంటుందని, ముందు ముందు ఇద్దరి కాంబోలో మరిన్ని సినిమాలు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో అనూహ్యంగా దిశా చేతి పై పీ డీ అనే అక్షరాలు ఉండటంతో ఏం జరుగుతుందో అర్థం కాక కొందరు జుట్టు పీక్కుంటూ ఉంటే మరి కొందరు మాత్రం కథలు కథలు అల్లేస్తున్నారు. ప్రభాస్ అంటే దిశా పడి చచ్చి పోతుందని కూడా కొందరు సోషల్‌ మీడియా ద్వారా రాసేస్తున్నారు. ఇంతకు దిశా మనసులో ఏముంది.. ఆ పీ డీ కి అర్థం ఏంటి అనేది ఆమె చెప్పాలి.

Tags:    

Similar News