పల్లెటూరి అందంలో దివి హీటెక్కించేసిందిగా..
అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. 80ల్లో హీరోయిన్స్ లాగా చేతుల్లోని జాకెట్ ధరించింది.
యంగ్ హీరోయిన్ దివి అంటే ఎవరికీ పెద్దగా తెలియదేమో కానీ, బిగ్ బాస్ దివి అంటే మాత్రం అందరికీ వెంటనే గుర్తుకువస్తుంది. బిగ్ బాస్ కి రాక ముందు కూడా దివి చాలా సినిమాల్లో నటించింది. కానీ అవి చాలా చిన్న పాత్రలు. అందుకే, ఎవరూ పెద్దగా గుర్తించలేదు. కానీ, ఎప్పుడైతే స్టార్ మా పుణ్యామా అని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిందో, ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి.
ఆ షోలో దివి ఎక్కువగా చీరల్లో కనిపించి మెస్మరైజ్ చేసింది. అప్పటి నుంచి ఆమెకు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. దివి నుంచి కిందకు దిగి వచ్చిన దేవతలా ఆమెను చూస్తూ మురిసిపోతున్నారు. ఇక, ఫ్యాన్స్ పెరగడంతో, ఆమె కూడా సోషల్ మీడియాలో తన అభిమానులను ఆకట్టుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది.
కేవలం, వారిని అలరించడం కోసమే ఫోటో షూట్స్ చేసి, షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా చీరకట్టులో మెరిసింది. అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. 80ల్లో హీరోయిన్స్ లాగా చేతుల్లోని జాకెట్ ధరించింది. ఆ చీర కూడా నలుక చీర అని తెలుస్తోంది. మేకప్ కూడా పల్లెటూరి ఎంకి లా ముస్తాబైంది. ముక్కుకు ముక్కెర తో చాలా సహజంగా, అందంగా ఉంది.
బిగ్ బాస్ తర్వాత దివి కి ఈ మధ్య సిల్వర్ స్క్రీన్ మీద ఆఫర్స్ పెరిగాయి. అలాగే డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తున్నారు. కొద్ది కాలం క్రితం ఆమె కీలక రోల్ చేసిన ఏటిఏం అనే వెబ్ సిరీస్ విడుదలైంది. అలాగే కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. గత ఏడాది విడుదలైన జిన్నా మూవీలో దివి ప్రాధాన్యత ఉన్న పాత్ర చేశారు. మూగ అమ్మాయి అయిన హీరో ఫ్రెండ్ పాత్రలో మెప్పించారు.
స్టార్ హీరోలో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తోంది. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో దివికి మంచి పాత్రే దక్కిందని చెప్పాలి. ఇటీవల పుష్ప2 లోనూ రిపోర్ట్ గా కనిపించనుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో అలా తళుక్కున మెరిసింది. పుష్ప2 తర్వాత మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.