బ్రేక‌ప్ వార్త‌ల న‌డుమ నిర్మాత భార్య క్రిప్టిక్ పోస్ట్

Update: 2024-02-24 14:55 GMT

ప్ర‌భాస్ తో `సాహో, రాధేశ్యామ్` లాంటి భారీ చిత్రాల‌ను స‌హ‌నిర్మించిన టీసిరీస్ టాలీవుడ్‌లోను పాపుల‌ర్ బ్యాన‌ర్ గా ఎదిగింది. ఇప్పుడు ఈ సంస్థ అధినేత కుటుంబంలో క‌ల‌త‌లు ఉన్నాయ‌ని హిందీ మీడియా క‌థ‌నాలు అల్లుతోంది. ప్ర‌ముఖ క‌థానాయిక దివ్యా ఖోస్లాను టీసిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్ 2005లో పెళ్లాడారు. అయితే ఈ వైవాహిక బంధంలో క‌ల‌త‌లు ఏర్ప‌డ్డాయ‌ని కొద్దిరోజులుగా వ‌రుస క‌థ‌నాలు వెలువ‌డుతుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇటీవ‌ల దివ్య ఖోస్లా తన పేరు నుండి `కుమార్`ని తొలగించినప్పటి నుండి నెటిజ‌నుల్లో పెద్ద ఎత్తున ఆరాలు మొద‌ల‌య్యాయి. అంతే కాదు దివ్య ఖోస్లా ఇన్‌స్టాగ్రామ్‌లో టి-సిరీస్‌ను కూడా అన్‌ఫాలో చేసింది. దీంతో ఖంగు తిన్న‌ భూషణ్ కుమార్ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. జ్యోతిష్య కారణాల వల్ల దివ్య తన పేరు నుండి `కుమార్`ని తొలగించిందని, విడాకుల వార్తల్లో నిజం లేదని పేర్కొంది.

కానీ అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా క‌థ‌నం హాట్ టాపిక్ గా మారింది. దీని ప్ర‌కారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుండి `కుమార్`ని తొలగించిన కొన్ని రోజుల త‌ర్వాత దివ్య కొత్త పోస్ట్ ఇప్పుడు పెద్ద షాకిస్తోంది. ఈ పోస్ట్‌ను పరిశీలిస్తే దివ్య ఖోస్లా కాపురంలో ఖచ్చితంగా అన్నీ సరిగ్గా లేవని అనిపించ‌క మాన‌దు. దివ్య ఖోస్లా తన పేరు నుండి కుమార్‌ని తొలగించిన తర్వాత ఇంత కాలానికి ఒక రహస్య పోస్ట్‌ను షేర్ చేసింది. దివ్య ఖోస్లా ఒక అభిమాని పోస్ట్‌ను మళ్లీ పోస్ట్ చేసారు. ఈ పోస్ట్‌లో దివ్య తన తల్లితో క‌లిసి ఉన్న కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. ``తల్లి ప్రేమ శాశ్వతమైన ప్రేమ`` అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. దివ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫోటోని మళ్లీ పోస్ట్ చేసి, ``మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. మీకు చెప్పడానికి చాలా ఉంది`` అని వ్యాఖ్య‌ను జోడించింది.

దివ్య ఖోస్లా తాజా పోస్ట్ మరోసారి సందేహాల‌ను రేకెత్తించింది. దివ్య -భూషణ్ కుమార్ మధ్య ఖచ్చితంగా అన్నీ సరిగ్గా లేవు అనే ఊహాగానాలు మళ్లీ మొద‌ల‌య్యాయి. నిజానికి విడాకుల గురించి మీడియాలో ఇప్పటికే ఊహాగానాలు సాగుతున్న క్ర‌మంలో దివ్య సూపర్ ఎమోషనల్ క్యాప్షన్‌తో ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేస్తే, అది మ‌రిన్ని సందేహాల‌కు తావివ్వ‌కుండా ఉంటుందా? ఏది నిజం? ఏది అబద్ధం? అనే దానిపై ప్రజల మనస్సులలో సందేహాలు క‌ల‌గ‌డం ఖాయం.

అయితే టీసిరీస్ వివ‌ర‌ణ ప్ర‌కారం.. దివ్య జ్యోతిష్యాన్ని నమ్మి తన పేరు నుండి `కుమార్`ని తొలగించిందని భావించినా కానీ... త‌న‌ భర్తను సోష‌ల్ మీడియాలో అనుసరించకుండా ఉండవలసిన అవసరం ఏమిటి? అన్న సందేహాలు క‌లుగుతున్నాయ‌ని హిందీ మీడియాలో క‌థ‌నం వెలువ‌డింది. మెరుగైన జీవితం కోసం సోషల్ మీడియాలో పేజీలను అన్‌ఫాలో చేయమని ఏ జ్యోతిష్కుడూ దివ్యకు సలహా ఇవ్వలేదని అర్థం చేసుకుంటున్నారు.

భూషణ్ కుమార్- దివ్య ఖోస్లా 13 ఫిబ్రవరి 2005న వివాహం చేసుకున్నారు. వారికి అక్టోబరు 2011లో ఒక కుమారుడు కూడా జన్మించాడు. దివ్య దర్శకురాలు, నటి కం నిర్మాత‌ కూడా. సత్యమేవ జయతే 2 , `యారియాన్ 2` వంటి చిత్రాలలో నటించిన దివ్య యారియాన్ -సనమ్ రే అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించింది.

Tags:    

Similar News