ఫోటో స్టోరి: మనసుంటే వయసుతో పనేం ఉంది?
తాజాగా నేహా అందమైన మెరూన్ చీరలో తళుక్కుమన్న ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. మెరూన్ శారీకి కాంబినేషన్ గా ఆరెంజ్ బ్లౌజ్ - రెట్రో నెక్లెస్‌తో ఎంతో అందంగా కనిపించింది.
మనసుండాలే కానీ వయసుతో పని లేదు. అందం ఉన్నది ప్రదర్శించేందుకే. రేఖ, ఐశ్వర్యారాయ్ లాంటి సీనియర్ నటీమణులు దీనికి ఉదాహరణ. ఇప్పుడు 43ఏళ్ల వయసులో నేహా ధూపియా తన అందాన్ని ప్రదర్శించడంలో ఎలాంటి నియమాలను పాటించలేదు. జూలీగా కుర్రకారు గుండెల్లో నిలిచి ఉన్న నేహా ధూపియాను ఇప్పటికీ హాట్ మోడల్ గానే యువతరం గుర్తుంచుకుంది. పెళ్లయి తనకు సంసారం, పిల్లల బాధ్యతలు ఉన్నా ఇప్పటికీ తన అందాన్ని మెయింటెయిన్ చేయడంలో నేహా ఎక్కడా తగ్గడం లేదు.
నేహా ధూపియా నిరంతరం సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలను షేర్ చేయడానికి వెనకాడరు. అంతేకాదు తనలోని పరిపూర్ణ మహిళను ఆవిష్కరించడానికి అవకాశం ఉన్న ఏ వేదికను విడిచిపెట్టదు. నటన నుంచి కొన్నాళ్లుగా దూరంగా ఉన్నా కానీ, పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా కొనసాగుతోంది. నేహా సోషల్ మీడియా యాక్టివిటీ పరంగా చాలా తరచుగా అభిమానులకు టచ్ లో ఉంటుంది. రెగ్యులర్ గా తన వెకేషన్స్ కి సంబంధించి లేదా వ్యక్తిగత ఈవెంట్లకు సంబంధించిన ఫోటోషూట్లను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంది.
తాజాగా నేహా అందమైన మెరూన్ చీరలో తళుక్కుమన్న ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. మెరూన్ శారీకి కాంబినేషన్ గా ఆరెంజ్ బ్లౌజ్ - రెట్రో నెక్లెస్‌తో ఎంతో అందంగా కనిపించింది. ఈ లుక్ క్లాసిక్ అంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా చీరలో దేశీ వైబ్స్ ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయంటూ కితాబిచ్చేస్తున్నారు. నేహా తన ఒంపు సొంపుల ఖజానాను ఎలివేట్ చేసిన తీరు ఆకర్షిస్తోంది. అభిమానులు ఆమె కొత్త లుక్‌లోని ప్రతి అంశాన్ని ఆరాధిస్తున్నారు. తమదైన శైలిలో హార్ట్ ఈమోజీలను షేర్ చేస్తూ ప్రేమను కురిపిస్తున్నారు. కొందరు హాటీ అని కూడా వ్యాఖ్యానించారు. తన వయసును మించిన అందంతో మెరిసిపోవడం నేహాకే చెల్లింది అంటూ కితాబిచ్చేస్తున్నారు. మానసిక ఆరోగ్యం (మెంటల్ హెల్త్) నేపథ్యంలో ఇటీవలే ఒక సిరీస్ ని ప్రారంభిస్తున్నట్టు నేహ ధూపియా ప్రకటించింది.