దేవ‌ర‌కొండ లెగ్ పీస్ ఇలాగే తింటాడు.. థాంక్స్ ఆర్యా!

అంతేకాదు.. దేవ‌ర‌కొండ‌కు బిరియానీ అంటే ఇష్టం అనుకుంటా! లెగ్ పీస్ ఇలాగే తింటాడేమో!! అంటూ బోలెడంత ఫ‌న్ కురిపించింది.

Update: 2024-07-03 05:19 GMT

కల్కి 2898 AD 2024లో విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. 500 కోట్ల క్లబ్ నుంచి 1000 కోట్ల క్ల‌బై వైపు ప్ర‌యాణిస్తున్న ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలో దేవ‌ర‌కొండ అతిథి పాత్ర అంద‌రినీ ఆక‌ట్టుకుంది. తెలుగు ప్ర‌జ‌ల్లో దీనిగురించి చ‌ర్చ సాగుతుండ‌గానే, ఇప్పుడు వేరొక ఆస‌క్తిక‌ర కారణంతో దేవ‌ర‌కొండ పేరు మార్మోగుతోంది.

ఆర్య‌కు పిచ్చి ప‌రిశీల‌నా శ‌క్తి ఉంది (న‌వ్ ఆర్య హ్యాజ్ క్రేజీ అబ్జ‌ర్వేష‌న్ స్కిల్స్!) అంటూ స్టోరీస్ బై టూ ప్ల‌స్ వ‌న్ ఇన్ స్టాగ్ర‌మ్ వేదిక‌గా ఒక క్యూట్ వీడియోని షేర్ చేసారు. ఈ వీడియోలో నాలుగేళ్ల‌ చిన్నారి విజ‌య్ దేవ‌ర‌కొండ మైక్ ప్రామ్టింగ్ గురించి ప్ర‌స్థావిస్తూ.. అంద‌రూ మైక్ ని ఇలా ప‌ట్టుకుంటే దేవ‌ర‌కొండ అలానే ఎందుకు ప‌ట్టుకుని మాట్లాడతాడు? అని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. దేవ‌ర‌కొండ‌కు బిరియానీ అంటే ఇష్టం అనుకుంటా! లెగ్ పీస్ ఇలాగే తింటాడేమో!! అంటూ బోలెడంత ఫ‌న్ కురిపించింది. విజయ్ మైక్ ప‌ట్టుకునే తీరును ఇమ్మిటేట్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. చిన్నారి ఆర్య క్యూట్ చ‌బ్బీ టాక్స్ అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్విస్తున్నాయి.

దీనికి విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి కూడా రిప్ల‌య్ వ‌చ్చింది. ''నాకు బిరియానీ విప‌రీతంగా ఇష్టం ఆర్యా!'' అంటూ రెడ్ హార్ట్ ఈమోజీని షేర్ చేసిన దేవ‌ర‌కొండ ''మైక్ అలా ఎందుకు ప‌ట్టుకుంటానో తెలీదు.. నాకు అడ్డు రాకుండా కంఫ్ల‌బుల్ ఉంటుంది అని అనుకుంటా.. బిగ్ హ‌గ్స్ టు యు'' అని రాసారు.

అతిథి పాత్ర‌తో మెరుపులు:

'కల్కి 2989 ఏడి' చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశంలో అర్జునుడిగా కనిపించాడు. అతడు అమితాబ్ బచ్చన్ ఐకానిక్ అశ్వత్థామతో యుద్ధభూమిలో పోరాడాడు. ఈ అతిధి పాత్ర అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విజయ్ చిన్నదైన కానీ ప్రభావవంతమైన నటనకు ప్రజలు ప్రశంసిస్తున్నారు. విజయ్ వంటి అతిధి పాత్రలు ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా చేశాయనడంలో సందేహం లేదు. అయితే, ఈ పాత్ర కోసం అతను ఎంత వసూలు చేశాడు? అంటూ నెటినుల్లో ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం జెర్సీ ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర‌కొండ‌ ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Read more!
Tags:    

Similar News

eac