కపూర్ ఇంట కోడలని కాదులేండి! కరీనా
పెళ్లి చేసుకుని తల్లైనా కరీనా అందం ఇసుమొత్తు కూడా తరిగిపోలేదని ఇప్పటికే ప్రూవ్ అయింది.
సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ నవతరం నాయికలకు గట్టిపోటినిస్తూ దూసుకుపోతుంది. కొత్తతరం నటీమ ణులు ఎందరొచ్చినా! నాకెవరూ పోటీ అంటూ కెరీర్ లో అంతకంతకు శిఖరాల్ని తాకుతుంది. వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. దీపికా పొదుకొణే...రాణీ ముఖర్జీ..కత్రినా లాంటి భామలతో తగ్గాఫ్ వార్ ఉన్నా! నా స్ట్రాటజీ నాకుందంటూ రేసులో ముందుకు దూసుకుపోతుంది.
పెళ్లి చేసుకుని తల్లైనా కరీనా అందం ఇసుమొత్తు కూడా తరిగిపోలేదని ఇప్పటికే ప్రూవ్ అయింది. వివాహం తర్వాత కథలపరంగా చాలా సెలక్టివ్ గా వెళ్తుంది. గ్లామర్ పాత్రలకంటే బాక్సాఫీస్ వద్ద సోలోగా నిలబడే ప్రయ త్నాలు గట్టిగానే చేస్తుంది. వెండితెర నుంచి ఓటీటీ వరకూ ఆ తరహా కంటెంట్ కే అధికా ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఈ సీనియర్ బ్యూటీ ఇష్టపడే జూనియర్ నటి ఎవరు? అంటే ఠక్కున కరీనా అలియాభట్ పేరు చెప్పింది.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన మనసులోమాట చెప్పేసింది కరీనా. ‘నాకు నేటి కథానాయికల్లో అలియాభట్ అంటే చాలా ఇష్టం. తను మా ఇంటి అబ్బాయిని చేసుకుందని కాదు. నటిగా తను ఓ రేంజ్. అంతేకాదు. తను ఎంచుకునే పాత్రలు కూడా అద్భుతం. సినిమా సినిమాకీ నటిగా తన స్థాయిని పెంచుకుంటుంది. అలియా- రణ్‌బీర్ పెళ్లి చేసుకోకముందే నేను అలియా ఫ్యాన్‌ని. ఆ విషయం తనకు కూడా చెప్పాను.
తనేమో నా ఫ్యాన్‌ని అని అందరికీ చెప్పుకుంటుంది. ఏదేమైనా ఆమెకు మంచి కెరీర్ ఉంది. రణ్‌బీర్ తనని ప్రోత్సహిస్తే వెండితెరపై అద్భుతాలు సృష్టించగల నటి అలియా’ అని తెలిపింది కరీనా. నిజమే నేటి తరం భామల్లో అలియాభట్ గొప్ప నటిగా కీర్తింపబడుతుంది. అందుకే గంగూబాయికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కైవసం చేసుకుంది. దేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్ ఆర్ ఆర్` లో సీతమ్మ పాత్రలో నటించే అరుదైన అవకాశం ఒడిసిపట్టుకుంది.