చరణ్ సినిమాల సంగతి తేలేది ఆ రోజే!
అయితే రామ్ చరణ్.. మార్చి 27వ తేదీన తన బర్త్ డే జరుపుకోనున్నారు. ఆ రోజు మెగా అభిమానులకు డబుల్ బొనాంజా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరూ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా చిత్రాలను చేస్తూ తమ రేంజ్‌ను మరింతగా పెంచుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురు హీరోలు గ్లోబల్ స్టార్లుగా కూడా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఫుల్ ఫామ్‌లో ఉన్న చరణ్.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు.
వరుస హిట్లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనా.. మధ్యలో బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను కూడా కనీసం ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు మేకర్స్.
మరోవైపు, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. హీరో డేట్స్ కోసం దర్శకుడు వెయిట్ చేస్తున్నారు. మార్చి రెండో వారం తర్వాత లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట.
అయితే రామ్ చరణ్.. మార్చి 27వ తేదీన తన బర్త్ డే జరుపుకోనున్నారు. ఆ రోజు మెగా అభిమానులకు డబుల్ బొనాంజా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ రెండు చిత్రాల అప్డేట్లను మేకర్స్ ఆరోజే ఇవ్వనున్నారట. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ తోపాటు బుచ్చిబాబు మూవీ లాంఛింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారట. ఎప్పటి నుంచో చరణ్ చిత్రాల అప్డేట్ల కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారట.
గేమ్ చేంజర్ మేకర్స్.. గ్లింప్స్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా.. ఆర్ సీ16 మేకర్స్ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారట. గేమ్ చేంజర్ మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
మరోవైపు, బుచ్చిబాబు ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ కోస్తాంధ్ర యువకుడిగా కనిపించబోతున్నారని టాక్. ఆయన పక్కన ఎవరు హీరోయిన్ అనేది తెలియాల్సి ఉంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన మ్యూజిక్ సెషన్స్ మొదలుపెట్టేశారట.