'డబుల్ ఇస్మార్ట్' కి అక్కడ సవాల్ తప్పదా?
దీనిలో భాగంగా బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ని సైతం రంగంలోకి దించి విలన్ బాధ్యతలు అప్పగించాడు.
డ్యాషింగ్ డైరెక్టర్ పురిజగన్నాధ్ పాన్ ఇండియా సినిమా కల ఇంకా నెరవేరని సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నం'లైగర్' భారీ అంచనాల మధ్య చేసినా అది దారుణమైన ఫలితాన్ని చూసింది. ఆ సినిమా కంటే హిందీలో'ఇస్మార్ట్ శంకర్' బెటర్ టాక్ తో నడిచింది. దీంతో ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తోన్న'డబుల్ ఇస్మార్ట్' ని కూడా నార్త్ రీజియన్ లో భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
దీనిలో భాగంగా బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ ని సైతం రంగంలోకి దించి విలన్ బాధ్యతలు అప్పగించాడు. అతడి ఎంట్రీ సినిమాకి అమాంతం మంచి హైప్ తీసుకొచ్చింది. రామ్ ఎనర్జీకీ దత్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రచ్చ తప్పదనే అంచనాల్లో యూనిట్ కనిపిస్తోంది. ఇక సినిమా ఎట్టకేలకు అన్ని పనులు పూర్తిచేసుకుని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకి టాక్ బాగుంటే తిరుగుండదు.
ఆ రోజు తెలుగు నుంచి పెద్దగా రిలీజ్ లేవు. ఉన్న సినిమాలు కూడా పెద్దగా పోటీలో లేనివే. అయితే తంగలాన్ మాత్రం కాస్త పోటీనివ్వొచ్చు. కానీ అది డబ్బింగ్ సినిమా కాబట్టి తెలుగు సినిమా తర్వాతే సెకెండ్ ఆప్షన్ గా ఉంటుంది. అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రం డబుల్ ఇస్మార్ట్ కి సవాల్ తప్పేలా లేదు. ఈ సినిమాతో పాటు పోటీగా మరో మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
వరుసగా పబ్లిక్ హాలీడేలు రావడంతో డేట్ ని ముందే లాక్ చేసుకున్నాయి. శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావు నటించిన'స్త్రీ-2' రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి హైప్ వచ్చింది. పైగా హిట్ సినిమాకి సీక్వెల్ కావడంతో మరింత అంచనాలతో రిలీజ్ అవుతుంది. అలాగే అక్షయ్ కుమార్, తాప్సీ నటిస్తోన్న'ఖేల్ ఖేల్ మే' కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది.
అక్షయ్ వరుస వైఫల్యాలు ఈ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉన్నా తొలి షో అనంతరం టాక్ పాజిటివ్ గా వస్తే సీన్ మారిపోతుంది. అలాగే జాన్ అబ్రహం నటిస్తోన్న'వేదా' కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకూ ఈ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. రిలీజ్ దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల్ని ప్రత్యేకంగా ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు. మరి వీటన్నింటి మధ్యలో డబుల్ ఇస్మార్ట్ ఎలాంటి హిట్ సాధిస్తుందన్నది చూడాలి.