అంబానీ కోడలు నీలి రంగు నెక్లెస్ ఖరీదు?
ఇలాంటి నీలి రంగు నేపథ్యాన్ని కోరుకోవడానికి కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో రాధిక వెల్లడించింది. తాను రొమాంటిక్ గా యవ్వనంగా కనిపించాలని కోరుకున్నట్టు తెలిపింది.
అంబానీ ఇంట ప్రీవెడ్డింగుల కోసమే 1000 కోట్లు పైగా ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు పెళ్లి కోసం మరో 1000 కోట్లు పైగా సునాయాసంగా ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇటీవలే అంబానీ క్రూయిజ్ షిప్ ఈవెంట్ కోసం 500కోట్లు పైగానే ఖర్చయిందని ఒక అంచనా. ఇక ఈ ఈవెంట్లో కళ్లన్నీ కాబోయే పెళ్లికూతురు రాధికపైనే. రాధిక మర్చంట్ కస్టమ్ వెర్సెస్ డిజైనర్ దుస్తులు ధరించి అరుదైన నీలిరంగు వజ్రాల ఒపల్ నెక్లెస్‌ను ధరించారు. ఇది అనంత్ అంబానీపై తనకున్న ప్రేమకు ప్రతీక.
అంబానీ విహారయాత్ర మూడవ రోజున భారీ నౌక ఫ్రాన్స్‌లోని సుందరమైన కేన్స్ నగరానికి చేరుకుంది. చారిత్రక చాటో డి లా క్రోయిక్స్ డెస్ గార్డెస్‌లో సంపన్నమైన మాస్క్వెరేడ్ బాల్ కోర్ట్ కు అంతా చేరుకున్నారు. ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ 1955 చలనచిత్రం 'టు క్యాచ్ ఎ థీఫ్'లో చూపించిన ఈ అద్భుతమైన కోట.. సాయంత్రం విలాసవంతమైన ఉత్సవాలకు అందమైన వేదికగా నిలిచింది.
ఈ ఈవెంట్ ఒక వండర్. వేదికపై రాధిక మర్చంట్ అద్భుతమైన కస్టమ్ వెర్సాస్ దుస్తుల్లో మెరిసిపోయింది. నీలిరంగు షేడ్స్‌తో కూడిన దుస్తులు, కోట్ డి అజుర్ రూపొందించారు. తన స్టైలిస్ట్, షాలీనా నథాని మార్గదర్శకత్వంతో ఈ కళాఖండానికి జీవం పోయడానికి వెర్సెస్ అటెలియర్‌తో ఒక సంవత్సరం పాటు రాధికా మర్చెంట్ సహకరించాల్సి వచ్చింది.
ఇలాంటి నీలి రంగు నేపథ్యాన్ని కోరుకోవడానికి కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో రాధిక వెల్లడించింది. తాను రొమాంటిక్ గా యవ్వనంగా కనిపించాలని కోరుకున్నట్టు తెలిపింది. తన మెడను లోరైన్ స్క్వార్ట్జ్ రూపొందించిన నీలిరంగు నెక్లెస్‌తో అలంకరించడం తనకు నచ్చుతుందని వెల్లడించింది. తన జన్మను అనుసరించి ఈ నీలి రంగు రాతిని ఎంపిక చేసుకుంది. కేన్స్‌లోని మాస్క్వెరేడ్ బాల్ అనంత్ - రాధిక జంట ప్రీవెడ్డింగ్ వేడుక మాత్రమే కాదు.. శృంగారం, వైభవం, మాయాజాలంతో నిండిన వారి ప్రేమకథకు నిదర్శనం.