ఇలాంటి బ్లాక్ బస్టర్ ఫ్లాప్ చూసి ఉండడు!
గత చిత్రాల ఫలితాల నేపథ్యం లో కింగ్ ఆఫ్ కోతా సినిమా ను భారీ పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయడం జరిగింది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నట వారసుడు దుల్కర్ సల్మాన్ కెరీర్ ఆరంభం నుండి మంచి సక్సెస్ లను దక్కించుకుంటూ వచ్చాడు. స్టార్ హీరో తనయుడిగా ఎంట్రీ ఈజీగానే లభించినా కూడా హీరోగా సక్సెస్ అయ్యేందుకు దుల్కర్ చాలా కష్టపడ్డాడు. తన నటన ప్రతిభను కనబర్చుతూ సక్సెస్ లను పొందుతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
కేవలం మలయాళ సినీ ఇండస్ట్రీకి పరిమితం అవ్వకుండా తెలుగు, హిందీ ఇతర భాషల్లో కూడా దుల్కర్ సల్మాన్ మంచి గుర్తింపును దక్కించుకుని స్టార్ గా నిలిచాడు. పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలు చేస్తున్న దుల్కర్ సల్మాన్ తాజాగా కింగ్ ఆఫ్ కోతా అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
గత చిత్రాల ఫలితాల నేపథ్యం లో కింగ్ ఆఫ్ కోతా సినిమా ను భారీ పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయడం జరిగింది. తెలుగు లో కూడా కింగ్ ఆఫ్ కోతా పేరుతో భారీ గా రిలీజ్ అయింది. సినిమాకు సంబంధించిన వసూళ్లు ప్రస్తుతం దుల్కర్ అభిమానులకు షాకింగ్ గా ఉన్నాయి.
దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా ఇలాంటి ఒక డిజాస్టర్ చవి చూసి ఉండడు అన్నట్లుగా మలయాళ సినీ వర్గాలతో పాటు పాన్ ఇండియా బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి రోజు మొదటి ఆట తోనే సినిమా పరిస్థితి ఏంటో తేలిపోయిందని, దాంతో వస్తాయనుకున్న కలెక్షన్స్ లో కనీసం 25 శాతం కలెక్షన్స్ రాలేదని సమాచారం అందుతోంది. ఈ సినిమా ఫలితం నేపథ్యం లో దుల్కర్ ముందు ముందు అయినా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.