డబ్బింగ్ జోరు లెక్క సరిపోయిందిక్కడ!
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. సినిమాకి డివైడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద తెలిపోయింది.
ఏటా డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ లో పోటా పోటీగా రిలీజ్ అవుతుంటాయి. టాలీవుడ్ మార్కెట్ తమిళ సినిమాలకు అత్యంత కీలకం కావడంతో తప్పకుండా ఇక్కడ రిలీజ్ భారీ ఎత్తున జరుగుతుంది. కార్తీ.. సూర్య..విశాల్ లాంటి నటుల సినిమాలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువే. అందుకే వాటిని ఇక్కడ ప్రత్యేకంగా రిలీజ్ చేస్తుంటారు. తలపతి విజయ్...ధనుష్ లాంటి స్టార్లు కూడా తెలుగు మార్కెట్ పై దృష్టి సారించిన దగ్గర నుంచి ఏటా వాళ్ల చిత్రాలు కూడా ఇక్కడా తప్పక రిలీజ్ అవుతున్నాయి.
ఈ ఏడాది కూడా అనువాద చిత్రాలు భారీగానే రిలీజ్ అయినట్లు కనిపిస్తోంది. ఎన్ని సినిమాలు విజయం సాధించాయో! ఆ లెక్క సరిపోయేలా ప్లాప్ లు కనిపిస్తున్నాయి. ఓసారి ఆ జాబితాని పరిశీలిస్తే...తలపతి విజయ్ కథానాయకుడిగా తెలుగు లో పరిచయమైన చిత్రం `వారసుడు`. వంశీ పైడి పల్లి తెరకెక్కించిన సినిమా రెండు భాషల్లోనూ రిలీజ్ అయింది. అయినా ఇది తెలుగు ఆడియన్స్ కి ఓ డబ్బింగ్ చిత్రంలాగే కనిపించింది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. సినిమాకి డివైడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద తెలిపోయింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` తో ఎలాంటి సంచలనాలు సృష్టించారో తెలిసిందే. అప్పటికే రిలీజ్ అయిన సూపర్ స్టార్ కొన్ని సినిమాలు తమిళ్ లో ఆడినా తెలుగులో ఆశించిన ఫలితాలు సాధించలేదు. కానీ జైలర్ మాత్రం అన్ని చోట్లా విజయ ఢంకా మోగించింది. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ రెండవ భాగం `పొన్నియన్ సెల్వన్ -2` కూడా మంచి విజయం సాధించింది.
పాన్ ఇండియాలో అభిమానులకు ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించిన చిత్రంగా నిలిచింది. అలాగే షారుక్ ఖాన్ `జవాన్`..`పఠాన్` సినిమాలు కూడా ఇక్కడా మంచి వసూళ్లని సాధించాయి. వరల్డ్ వైడ్ రెండు సినిమాలు 2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అందులో సౌత్ నుంచి షేర్ ఎక్కువగా నే ఉంది. ఇక మాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన `2018`..`కేరళ స్టోరీ` లాంటి సినిమాలు తెలుగు నాట సంచలన వసూళ్లని సాధించాయి. ఇప్పటివరకూ ఏ మలయాళ సినిమా ఈ రేంజ్ తో తెలుగు నాట సక్సెస్ అవ్వలేదు.
ఇక బాలీవుడ్ అనువాదంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన `యానిమల్` ఇక్కడా దుమ్ము దిలిపేసింది. తెలుగు సినిమా కానప్పటికీ రణబీర్ కపూర్ కి బెస్ట్ లాంచింగ్ లా నిలిచింది. `బిచ్చగాడు-2`.. `చిన్నా` లాంటి సినిమాలు పర్వాలేదనపించాయి. ఇక `కబ్జా`..`కింగ్ ఆఫ్ కొత్త`..`జపాన్`..`మార్క్ ఆంటోనీ`.. `జిగరత్తాండ -2`..`చంద్రముఖి-2`..`మహావీరుడు` లాంటి సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు.
'సప్తసాగరాలు` రెండు భాగాలకు పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు పెద్దగా కనిపించలేదు. 'బాయ్స్ హాస్టల్` మాత్రం పర్వాలేదనిపించింది. ఇంకా రిలీజ్ అయిన కొన్ని చిన్న సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. మొత్తంగా తెలుగు నాట అనువాద చిత్రాల జయపజాలు బ్యాలెన్స్ గానే కనిపిస్తున్నాయి.