'ఎమర్జెన్సీ' వాయిదా..కారణం అదా?
మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా కంగన రనౌత్ స్వీయా దర్శకత్వంలో 'ఎమర్జెన్సీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే
మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా కంగన రనౌత్ స్వీయా దర్శకత్వంలో 'ఎమర్జెన్సీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందిరమ్మ ఆహార్యంలో కంగన ఒదిగిన విధానం.. ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. కంగన ఖాతాలో మరో భారీ హిట్ ఖాయమంటూ కథనాలు వెడెక్కిస్తున్నాయి. రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో! అభిమానుల్లో ఇందిరమ్మగా కంగన ఎలా మెప్పిస్తుందన్న ఉత్సాహం రెట్టింపు అవుతుంది.
అన్ని పనులు పూర్తిచేసి నవంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పుడా తేది వాయిదా పడింది. అనూహ్యంగా సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయలేమని కంగన అభిమానులకు షాక్ ఇచ్చింది. రిలీజ్ వచ్చే ఏడాది సాధ్యమవుతుందని.. తేది తర్వాత చెబుతానంటూ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో సినిమా వాయిదా ఎందుకు పడ్డది? అన్న అంశంపై బాలీవుడ్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కారణాలు తెరపైకి వస్తున్నాయి.
ఎమర్జెన్సీ లో కొన్ని సన్నివేశాలు పర్పెక్షన్ మిస్ అవుతున్నాయని..వాటికోసం కంగన మళ్లీ రీ షూట్ కి వెళ్లే ప్లాన్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆసన్నివేశాలన్ని ఇందిరమ్మ పాత్రకు సంబంధించినవేనట. అంటే కంగనారనౌత్ చేసిన సన్నివేశాల్లోనే పర్పెక్షన్ రాలేదని తెలుస్తోంది. ఈ సినిమాకు తానే దర్శకురాలు. ఎడిటింగ్ టేబుల్ పై ఔట్ ఫుట్ చూసుకున్న సమయంలో కంగన సంతృప్తి పడలేదుట. ఈ నేపథ్యంలో రీ షూట్ చేస్తే జరిగిన తప్పిదాల్సి సరిదిదొచ్చు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కంగన ఈ బయోపిక్ కంటే ముందు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథలోనూ నటించిన సంగతి తెలిసిందే. 'తలైవి' టైటిల్ తో ఆ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కానీ ఆ సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో కంగన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోసారి 'ఎమర్జెన్సీ' విషయంలో అలాంటి అవకాశం ఇవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.