OG విల‌న్‌ని కెరీర్ ఖ‌తం అని బెదిరించారు!

తాను నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తుంటే, ఈ సినిమాతో నీ కెరీర్ ఖ‌తం అయిన‌ట్టేన‌ని ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు భ‌య‌పెట్టార‌ని ఇమ్రాన్ హ‌ష్మి ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

Update: 2024-07-18 02:45 GMT

2003లో 'ఫుట్‌పాత్‌' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన ఇమ్రాన్ హష్మీ రెండు ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ ర‌న్‌లో న‌టుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన సంగ‌తి తెలిసిందే. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఇటీవ‌ల న‌టుడిగా అవ‌కాశాలు అందుకుంటున్నాడు. హిందీ చిత్ర‌సీమ‌లో విల‌న్ గా, క్యారెక్ట‌ర్ న‌టుడిగా ప‌ని చేస్తూనే, ఇటీవ‌ల టాలీవుడ్ కోలీవుడ్ లోను అవ‌కాశాలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఓజీలో అత‌డు విల‌న్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే అత‌డు త‌న కెరీర్ ఆరంభంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల నుంచి హెచ్చ‌రిక‌లు ఎదుర‌య్యాయ‌ని తెలిపాడు. తాను నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తుంటే, ఈ సినిమాతో నీ కెరీర్ ఖ‌తం అయిన‌ట్టేన‌ని ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు భ‌య‌పెట్టార‌ని ఇమ్రాన్ హ‌ష్మి ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

ఫుట్ పాత్ త‌ర్వాత ఇమ్రాన్ ఎన్నో చిత్రాల్లో న‌టించాడు. మ‌ర్డ‌ర్ చిత్రంలో అత‌డి న‌ట‌న‌కు గొప్ప ఫాలోయింగ్ ఏర్ప‌డింది. సీరియ‌ల్ కిస్స‌ర్ గా ప్ర‌త్యేక బిరుదును అందుకున్నాడు. అయితే అంత‌కుముందు అత‌డు ఇండ‌స్ట్రీ వ్య‌క్తుల బెదిరింపుల‌ను ఎదుర్కొన‌నాడు. సన్నివేశాలు బాగుండాలని, లేకుంటే సినిమా నుండి తప్పిస్తామ‌ని కూడా అత‌డిని బెదిరించార‌ట‌. ఓ ఇంట‌ర్వ్యూలో ఇమ్రాన్ హష్మీ తన నటనా ప్రయాణానికి సంబంధించిన చాలా సంగ‌తులే ముచ్చ‌టించాడు.

త‌న‌కు అవ‌కాశం క‌ల్పించిన అగ్ర నిర్మాత మహేష్ భట్ ఓసారి త‌న‌ను తీవ్రంగా బెదిరించార‌ట‌. ''ఆ మొదటి షాట్‌లో, ఆపై సన్నివేశాలలో మీరు బాగా లేకుంటే, మేం మిమ్మల్ని మూవీ నుండి తొలగిస్తాము'' అన్నార‌ట‌. ప్రేక్షకులు తనను ఆదరించకపోతే నిర్మాత‌లు తమ డబ్బును నాపై పెట్టలేరని, ఎందుకంటే వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం ఇక్కడకు రాలేదని హ‌ష్మి చెప్పాడు.

ఇమ్రాన్ తన కుటుంబంలో ఎవ్వరూ తనకు నైపుణ్యాలు ఉన్నాయని భావించలేదని పేర్కొన్నాడు. నేను సినిమాల్లోకి రాకూడదని మా అమ్మమ్మ భావించింది. ఎందుకంటే నాకు నటుడిని కావాలనే ఆలోచన సంప్రదాయం దృష్ట్యా లేనే లేదు. నా గురించి మా అమ్మ నిజంగా భయపడింది. కానీ వారు ఆలోచించారు.. ప్ర‌య‌త్నిద్దామ‌ని అవ‌కాశం ఇచ్చారు'' అని తెలిపారు.

ప్ర‌స్తుత కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇమ్రాన్ తన వెబ్ షో 'షోటైమ్' విజ‌యాన్ని ఆస్వాధిస్తున్నాడు. మిహిర్ -అర్చిత్ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ నిర్మాత‌. ఇందులో రాజీవ్ ఖండేల్వాల్, మౌని రాయ్, నసీరుద్దీన్ షా, మహిమా మక్వానా, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓజీలోను ఇమ్రాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Tags:    

Similar News