న్యూయార్క్ ఫిలిం కోర్స్ బాగానే పనిచేస్తుందా?
ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. 'న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో 4 నెలల కోర్స్ చైసాను. నటిగా నేను మెరుగు అవ్వడంలో ఈ కోర్స్ ఎంతో ఉపయోగపడింది.
'మెహబూబ' తో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది నేహాశెట్టి. పెద్ద ప్రాజెక్ట్ ..పూరి జగన్నాధ్ తెరకెక్కించిన సినిమా కావడంతో అమ్మడి కెరీర్ కి తిరుగుండదని భావించింది. కానీ నేహా కెరీర్ ఆవిధంగా సాగలేదు. ఆ ప్లాప్ తో అమ్మడు మళ్లీ కనిపించలేదు. అటుపై కొంత గ్యాప్ అనంతరం 'డీజే టిల్లు'లో ఛాన్స్ దక్కించు కుని...కుర్రాళ్ల హృదయాల్లో రాధిక అక్కగా ఫేమస్ అయింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని బిజీ నటిగా మారింది.
కానీ ఈ మధ్యలో రాధిక అక్క చాలా సహవాసాలే చేసిందని ఎంత మందికి తెలుసు. అవును. కెరీర్ లో ఎదగడం కోసం అమ్మడు ఖండాలు దాటి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడంతోనే నేడు నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. అందుకు అమెరికాలో తాను తీసుకున్న శిక్షణ ఎంతో ఉపయుక్తంగా మారింది అంటోంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. 'న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో 4 నెలల కోర్స్ చైసాను. నటిగా నేను మెరుగు అవ్వడంలో ఈ కోర్స్ ఎంతో ఉపయోగపడింది.
నటిగా వైవిధ్యంగా కనిపించాలి. భిన్నమైన క్యారెక్టర్స్‌లో నటించాలనే నా ప్రయత్నానికి న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో చేసిన కోర్స్ బాగా హెల్ప్ అవుతోంది. పాత్రల మధ్య వ్యత్యాసాన్ని కోర్స్ పూర్తిచేసిన తర్వాత బాగా తెలుసుకోగల్గుతున్నాను. తొలి సినిమా సమయానికి నాకు ఎలాంటి అనుభవం లేదు. ఛాన్స్ వచ్చింది కాబట్టి నటించాను. అంతకు మించి నాకేం తెలియదు. కానీ నటన గురించి నాకు తెలియంది..నేర్చుకోవాల్సింది చాలానే ఉందని కాలక్రమంలో అర్దమైంది. అందుకే కొంత శిక్షణ అవసరమని భావించి న్యూయార్క్ వెళ్లాను' అని తెలిపింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ' గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' బుజ్జి పాత్రలో నటించింది. ఇందులో అమ్మడు విశ్వక్ సేన్ కి జోడీగా నటిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్- ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి బజ్ ని తీసుకొస్తున్నాయి.