చీరలో ఎస్తర్ బ్యూటీ క్యూట్ ఫోజులు..!
చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ని ప్రారంభించి, తర్వాత హీరోయిన్లుగా మారినవారు చాలా మందే ఉన్నారు
చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ని ప్రారంభించి, తర్వాత హీరోయిన్లుగా మారినవారు చాలా మందే ఉన్నారు. శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలుపెట్టినవారే. ఇప్పుడు వారిలాగే తనను తాను హీరోయిన్ గా నిరూపించుకోవాలని అనుకుంటోంది ఎస్తర్ అనిల్. ఈ పేరు చెప్పగానే చాలా మందికి గుర్తు రాకపోవచ్చు. కానీ, వెంకటేష్ దృశ్యం లో మూవీలో చిన్న పాప అనగానే ఎవరైనా గుర్తుపట్టేస్తారు.
ఈ చిన్నపాపే ఇప్పుడు ఇలా టూ మచ్ హాట్ గా తయారైంది. చాలా సార్లు ఎస్తర్ తనలోని హాట్ యాంగిల్ ని బయటపెట్టాలని ప్రయత్నించింది. అయితే, చాలాసార్లు ఎంత హాట్ గా కనిపించాలని అనుకున్నా, క్యూట్ గానే కనపడేది. కానీ, ఈ సారి శారీలో కనపడింది. కేరళవాసులు ఓనమ్ కి కట్టుకుంటారే , అలాంటి వైట్ కలర్ శారీలో మెరిసింది.
వైట్ కలర్ శారీ కి పర్పుల్ కలర్ బ్లౌజ్ తో మ్యాచ్ చేసింది. అద్దం ఎదురుగా నిలపడి, తన నడుము కనిపించేలా సెల్ఫీ తసుకొని, ఆ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో రెడీ అవుతున్న సమయంలో తీసుకున్న ఫోటో కావడం విశేషం. ఆ తర్వాత వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ తో, బయట మంచి గ్రీనరీ మధ్య మరో రెండు ఫోటోలు దిగి, వాటిని కూడా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక, ఎస్తర్ హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. మలయాళంతో పాటుగా తెలుగు..తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే, హీరోయిన్ రోల్ రాలేదు. కానీ, వస్తే మాత్రం తనను తాను నిరూపించుకోగల సత్తా ఆమెలో ఉంది.
2001 ఆగస్ట్ 27న కేరళలోని యనాడ్ ప్రాంతంలో జన్మించింది ఎస్తేర్ అనిల్. 2010లో నల్లవన్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో విడుదలైన దృశ్యం సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది. మొదట మళయాళం దృశ్యంలో నటించగా, తెలుగులోనూ ఆ పాత్రకు ఆమెనే తీసుకున్నారు. మరి ఈ బ్యూటీ హీరోయిన్ గా తన కెరీర్ ని ఎప్పుడు మొదలుపెడుతుందో చూడాలి.