'పుష్ప‌-2' కంటే ముందే అత‌డి నుంచి మ‌రో స‌ర్ ప్రైజ్!

బ‌న్వ‌ర్ సింగ్ రోల్ తో పాన్ ఇండియాలో నార్త్ లో సైతం ఎంతో ఫేమ‌స్ అయ్యాడు. ఇప్పుడ‌దే క్రేజ్ ని హీరో ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు

Update: 2024-04-12 07:17 GMT

'పుష్ప' విజ‌యంతో ఫ‌హాద్ పాసిల్ కి తెలుగులో మంచి గుర్తింపు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బ‌న్వ‌ర్ సింగ్ షెక్ వ‌త్ పాత్ర‌లో తన వైవిథ్య‌మైన న‌ట‌న‌తో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చిన న‌టుడిగా మారారు. మాలీవుడ్ లో ఎంతో ఫేమ‌స్ అయినా ఇక్క‌డ వాళ్ల‌కు అత‌ను 'పుష్ప' రిలీజ్ వ‌ర‌కూ పెద్ద‌గా తెలియ‌దు. బ‌న్వ‌ర్ సింగ్ రోల్ తో పాన్ ఇండియాలో నార్త్ లో సైతం ఎంతో ఫేమ‌స్ అయ్యాడు. ఇప్పుడ‌దే క్రేజ్ ని హీరో ఎన్ క్యాష్ చేసుకుంటున్నాడు.

అత‌డు మాలీవుడ్ లో న‌టించిన సినిమాలు తెలుగులోనూ అనువాదానికి ఆస‌క్తి చూపిస్తున్న నిర్మాత‌లెంతో మంది. ఇటీవ‌లే ప‌హాద్ న‌టించిన 'ఆవేశం' అనే సినిమా మ‌ల‌యాళం రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. మ‌రోసారి త‌న‌దైన మార్క్ అప్పిరియ‌న్స్ తో ఆక‌ట్టుకున్నాడు. సినిమా అంతా ప‌హాద్ వ‌న్ మ్యాన్ షోగా హైలైట్ అవుతుంది. బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు తమ సీనియర్లతో ర్యాగింగ్ గొడవ కారణంగా ప్రతీకారంతో రగిలిపోతారు.

సహాయం కోసం నగరంలో పేరుమోసిన రౌడీగా చెలామణిలో ఉన్న రంగాను కలుస్తారు. అక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం ఎలా మలుపులు తిరిగింద‌న్న‌ది ఎంతో గ్రిప్పింగ్ గా చూపించారు. జీతూ మాధ‌వ్ త‌న‌దైన మార్క్ మేకింగ్ తో ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేసాడు. ప‌హాద్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులంతా ఫిదా అవుతున్నారు. స్టోరీ విన‌డానికి సీరియ‌స్ యాక్ష‌న్ సినిమాలా అనిపించినా అన్ని ర‌కాల అంశాలు ఈ క‌థ‌లో ఉండ‌టం విశేషం. ఈ టాక్ చూసి తెలుగులోనూ అనువ‌దించాల‌ని కొంత‌మంది నిర్మాత‌లు అప్పుడే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం.

'పుష్ప‌-2' లో కూడా ప‌హాద్ రోల్ ఇంకా బ‌లంగా ఉంటుంది. క‌థ అంతా బ‌న్నీ..ప‌హాద్ పాత్ర‌ల మ‌ధ్య‌ ఎక్కువ‌గా తిరుగుతంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడీ సినిమా రిలీజ్ కూడా అత‌డికి కీల‌క‌మే. మ‌రి ఆ ఛాన్స్ ఏ నిర్మాత తీసుకుంటాడో చూడాలి. ఇటీవ‌లే రిలీజ్ అయిన మ‌ల‌యాళం సినిమాలు 'ప్రేమ‌లు'..'మంజుమ్మ‌ల్ బాయ్స్' ఇక్క‌డా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కాబ‌ట్టి 'ఆవేశం' అనువాదం అవ్వ‌డానికి చాలా అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Tags:    

Similar News