ఫ్యామిలీమ్యాన్ 3.. అత్యంత కష్టమైన షూటింగ్ ఇదే
ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ `ది ఫ్యామిలీమ్యాన్ 3` చిత్రీకరణను ముగించి రిలీజ్ కి రెడీ చేయడం ద్వారా మరో మైలురాయిని తాకారు.
తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే క్రియేటివ్ ప్రపంచాన్ని శాసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తిరుపతి కుర్రాళ్లు ఇంటర్నేషనల్ రేంజ్ ప్రాజెక్టులతో అదరగొడుతున్నారు. ముఖ్యంగా `ది ఫ్యామిలీమ్యాన్` వెబ్ సిరీస్‌తో వారి క్రేజ్ అమాంతం స్కైని టచ్ చేసింది. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీలో రెండు సీజన్‌లను గ్రాండ్ సక్సెస్ చేయడంలో రాజ్ అండ్ డీకే విజయవంతం అయ్యారు. ఇటీవలే సిటాడెల్ భారతీయ అనుసరణ `హనీ బన్నీ`తో రాజ్ అండ్ డీకే సత్తా చాటారు. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ `ది ఫ్యామిలీమ్యాన్ 3` చిత్రీకరణను ముగించి రిలీజ్ కి రెడీ చేయడం ద్వారా మరో మైలురాయిని తాకారు. ఇప్పటివరకూ అత్యంత కష్టమైన షూటింగ్ ఇదేనని రాజ్ అండ్ డీకే షూట్ ముగింపు ఉత్సవంలో వ్యాఖ్యానించారు. దీనికోసం చాలా శ్రమించామని కూడా తెలిపారు.
మూడవ సీజన్ 2025 దీపావళికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. షూటింగ్ కోసం అష్టకష్టాలను ఎదుర్కొన్నామని చివరి వరకు మాతో ఉన్న నటీనటులు, టీమ్‌కి కృతజ్ఞతలు అని రాజ్ అండ్ డీకే అన్నారు. తాజాగా ముగింపు ఉత్సవానికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసారు. ఇందులో ప్రధాన పాత్రధారి మనోజ్ భాజ్‌పేయి, సమంత, శ్రేయా ధన్వంతరి సహా ఇతర టీమ్ ఉన్నారు.
మేలో ఫ్యామిలీమ్యాన్ 3 షూటింగ్ ప్రారంభమైంది. నాగాల్యాండ్ సహా పలుచోట్ల కీలక షెడ్యూళ్లన్నిటినీ పూర్తి చేసారు. ఎప్పటిలానే సీజన్ 3లోను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారిగా, మధ్యతరగతి ఫ్యామిలీమ్యాన్ గా మనోజ్ భాజ్ పాయి కనిపిస్తారు. జాతీయ దర్యాప్తు సంస్థ కల్పిత విభాగం అయిన థ్రెట్ అనాలిసిస్ అండ్ సర్వైలెన్స్ సెల్ (TASC) కోసం ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా డబుల్ లైఫ్ గడిపే శ్రీకాంత్ తివారీ లైఫ్‌లో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? అన్నది సీజన్ 3లో చూడాలి. సుమన్ కుమార్ - రాజ్ అండ్ డికె రాసిన ఈ మూడవ సీజన్ లో మనోజ్ భాజ్ పాయ్ తో పాటు, ప్రియమణి (సుచిత్ర తివారీ), షరీబ్ హష్మి (జెకె తల్పాడే), ఆశ్లేష ఠాకూర్ (ధృతి తివారీ), వేదాంత్ సిన్హా (అథర్వ్ తివారీ) తదితరులు నటించారు. గుల్ పనాగ్ కూడా కొత్త సీజన్ లో చేరారు. దీనిని రాజ్ అండ్ డికె కి చెందిన డి2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించింది. 2019 సెప్టెంబర్ లో సీజన్ 1 ప్రీమియర్ కాగా, జూన్ 2021లో సీజన్ 2 స్ట్రీమ్ అయింది. ఇప్పుడు సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కావాల్సి ఉంది.