పుష్పరాజ్ పాట్నా ఈవెంట్.. ఎంత మంది వచ్చారంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఈవెంట్ లో తన కోసం వచ్చిన వారికోసం హిందీలో కొద్దిసేపు మాట్లాడాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ప్రేస్టీజియన్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగింది. ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ ఈవెంట్ పెద్దసంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా ఈవెంట్ ని పాట్నాలో చేయడంతో పబ్లిక్ కూడా ప్రత్యేక ఆసక్తి చూపించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఈవెంట్ లో తన కోసం వచ్చిన వారికోసం హిందీలో కొద్దిసేపు మాట్లాడాడు.
మొదటిసారి తాను బీహార్ వచ్చిన ఇక్కడి ప్రజలు అద్భుతంగా తనని రిసీవ్ చేసుకున్నారని అల్లు అర్జున్ చెప్పారు. ఈ ఈవెంట్ కి ఏకంగా 2 లక్షల మంది హాజరైనట్లు టాక్ వినిపిస్తోంది. మైదానం ఆల్ మోస్ట్ ఫుల్ అయిపొయింది. ప్రత్యేకంగా అల్లు అర్జున్ ని చూడటానికి అక్కడి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఆసక్తి చూపించారని ఆ జనసందోహం చూస్తుంటేనే తెలుస్తోంది. ఈ క్రౌడ్ బట్టి ‘పుష్ప 2’ పట్ల బీహార్ ప్రజలు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
ఇండియన్ మూవీ హిస్టరీలో ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా జరగడం మొదటి సారి అనే మాట వినిపిస్తోంది. ‘పుష్ప’ లాంటి ఒక్క సినిమా ఇమేజ్ తోనే నార్త్ లో పుష్పరాజ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందనేది ఈ ఈవెంట్ తోనే స్పష్టం అవుతోందని ఆయన అభిమానులు అంటున్నారు. ఇక నెక్స్ట్ జరగబోయే ఆరు ఈవెంట్స్ కూడా ప్రధాన పట్టణాలలో నిర్వహించబోతున్నారు.
వీటికి కూడా లక్షల్లో పబ్లిక్ హాజరయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఈవెంట్స్ ద్వారా ‘పుష్ప 2’ మూవీకి భారీ హైప్ రావడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘పుష్ప 2’ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వచ్చిన కొన్ని గంటల్లోనే హిందీలో ట్రైలర్ 21 మిలియన్ వ్యూవ్స్ క్రాస్ చేయగా తెలుగులో 34 మిలియన్స్ క్రాస్ చేసి యుట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.
ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే నార్త్ ఇండియన్స్ ని ఎట్రాక్ట్ చేసే పుష్పరాజ్ స్టైల్ ని పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసినట్లు అర్ధమవుతోంది. కచ్చితంగా నార్త్ లో ఈ సినిమా పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అనుకుంటున్నారు. పుష్పలో చేసిన వారితో పాటు జగపతి బాబు పుష్ప 2లో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే ఫాహద్ ఫాజిల్ కి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ స్కోప్ దొరికినట్లు అనిపిస్తోంది. శ్రీవల్లిగా రష్మిక మందాన క్యారెక్టర్ కి మంచి ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్ధమవుతోంది.