కోసుకోవడం.. కొట్టడం కాదు.. ఇది కదా ఫ్యాన్స్ చేయాల్సింది

హీరోల అభిమానులు కొంత మంది శృతి మించి ప్రవర్తిస్తూ ఉంటారు.

Update: 2024-09-03 04:38 GMT

హీరోల అభిమానులు కొంత మంది శృతి మించి ప్రవర్తిస్తూ ఉంటారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా ఉన్నవారు తమ అభిమాన హీరోలకి రక్తంతో తిలకం పెట్టడం, లేదంటే బ్లడ్ తీసి బొమ్మలు వేయడం చేస్తారు. అలాంటి యాక్టివిటీస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి తమకి ప్రాణాలిచ్చే స్థాయిలో అభిమానం ఉందని చూపించుకుని ప్రయత్నం చేస్తారు. హింసాత్మకంగా తమ ఫ్యానిజం చూపించడాన్ని ఏ హీరో కూడా హర్షించడు.

అయితే తెలుగు, తమిళ్ రాష్ట్రాలలో ఇలాంటి ఫ్యాన్స్ కొందరు మంది హీరోలకి ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఒక స్టార్ హీరో ఫ్యాన్ ఒకడు చేతిని కోసుకొని రక్తంతో కటౌట్ కి బొట్టు పెట్టాడు. ఆ వీడియోని ఒక ఫ్యాన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిపై సదరు హీరో ఫ్యాన్స్ సైతం విమర్శలు చేశారు. ఇవి కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. బయట కూడా ఫ్యాన్స్ కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇలాంటి పనులు చేయొద్దని స్టార్ లు అభిమానులకి వార్నింగ్ లు ఇచ్చిన కూడా వారిలో మార్పు రాదు. తమ అభిమాన హీరోల తరహాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి గొప్ప ఫ్యాన్స్ అని చూపించుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉంటారు. అభిమానుల్లో హిస్మాత్మకంగా బిహేవ్ చేసేవారు ఉన్నట్లే సోషల్ యాక్టివిటీస్ చేసేవారు కూడా ఉంటారు. ఏపీలో ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాలలో వరద బీభత్సం సృష్టించింది.

ముఖ్యంగా విజయవాడలో అయితే చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇలాంటి సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వచ్చింది. జనసైనికులు, పవర్ స్టార్ అభిమానులు పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలని సహాయక కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ లాంటివి కాకుండా వరదబాధితులకి ఆహారం పంపిణీ చేయడంతో పాటు చాలా చోట్ల వారికి తోచిన స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీటిని సోషల్ మీడియాలో జనసైనికులు పంచుకున్నారు.

ఈ వీడియోలని చూపిస్తూ ఫ్యానిజం అంటే కోసుకోవడం, కొట్టుకోవడం కాదని, ఇలా అభిమాన హీరో స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేసి గొప్పతనం నిరూపించుకోవాలనే కామెంట్స్ చేస్తున్నారు. జనసైనికులు తన అభిమాన హీరోకి రాజకీయంగా సపోర్ట్ నిలవడమే కాకుండా వరదబాధితులకి సహాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారని చాలా మంది కొనియాడుతున్నారు. హీరోలని అభిమానించడమే కాదు. వారు చేసే మంచి పనులని స్ఫూర్తిగా తీసుకొని సోషల్ సర్వీస్ చేయడం ద్వారా అందరికి స్ఫూర్తిగా నిలవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News