అఖిల్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి..!
ఆ సినిమాతో మరోసారి ఫెయిల్యూర్ చవిచూశాడు. అఖిల్ ఏజెంట్ కోసం చాలా కష్టపడ్డాడు కానీ సినిమా మాత్రం వర్క్ అవుట్ కాలేదు.
అక్కినేని అఖిల్ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. అక్కినేని మనం లో అలా తళుక్కున మెరిసిన అఖిల్ మొదటి సినిమా తన పేరునే టైటిల్ గా పెట్టుకుని సినిమా చేశాడు. అక్కినేని నట వారసుడిగా భారీ బడ్జెట్ తో చేసిన అఖిల్ నిరాశపరచింది. ఇక ఆ తర్వాత మళ్లీ కొద్దిపాటి గ్యాప్ తో హలో అంటూ మరో అటెంప్ట్ చేశాడు ఆ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను కూడా అంతే. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్నాడు అఖిల్.
అయితే ఫస్ట్ హిట్ ఇచ్చిన కిక్ తో మరోసారి సాహసం చేయాలని అనిపించడంతో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ సినిమా చేశాడు. ఆ సినిమాతో మరోసారి ఫెయిల్యూర్ చవిచూశాడు. అఖిల్ ఏజెంట్ కోసం చాలా కష్టపడ్డాడు కానీ సినిమా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఈ సినిమా ఫెయిల్యూర్ విషయంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి మీద నిర్మాత కూడా తన అసంతృప్తిని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.
2023 ఏప్రిల్ లో రిలీజైన అఖిల్ ఏజెంట్ సినిమా అక్కినేని ఫ్యాన్స్ ని తీవ్రంగా డిజప్పాయింట్ చేసింది. ఆ సినిమా తర్వాత అఖిల్ ఒకటి రెండు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్టు వార్తలు వచ్చినా అవేవి సెట్స్ మీదకు వెళ్లలేదు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఒక్క న్యూస్ కూడా బయటకు రాలేదు. అఖిల్ సినిమాల విషయంలో చేస్తున్న ఈ లేట్ వల్ల అతని కెరీర్ గ్రాఫ్ మరింత రిస్క్ లో పడే అవకాశం ఉంది.
ఎలాగు ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి సినిమా వెంట సినిమా చేస్తూ వెళ్తుంటే అయినా హిట్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెండేళ్లకు ఒక సినిమా చేసి అది కాస్త నిరాశ పరిస్తే మళ్లీ ఏడాదికి పైగా టైం తీసుకోవడం హీరో కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. అఖిల్ ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. 2023 ఏప్రిల్ లో ఏజెంట్ రిలీజ్ కాగా ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. సో 2024 లో కూడా అఖిల్ సినిమా వచ్చే ఛాన్స్ లేదు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ వెంట వెంటనే సినిమాలు చేస్తే చూడాలని ఆశపడుతున్నారు.