స్టార్ హీరో కొడుకునని చెప్పుకోలేకపోయా!
ఇటీవలే రిలీజ్ అయిన `హీరామండి` వెబ్ సిరీస్ తో మళ్లీ రీలాంచ్ అయ్యాడు.
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో ఫిరోజ్ ఖాన్ కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన పర్దీన్ ఖాన్ ఇండస్ట్రీ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ప్రేమ్ అగాన్' తో ఎంట్రీ ఇచ్చిన పర్దీన్ ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎన్నో విజయాలు అందుకున్నాడు. అలాంటి నటుడు ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. 14 ఏళ్లగా ఇండస్ట్రీ లో కనిపించలేదు. ఇటీవలే రిలీజ్ అయిన `హీరామండి` వెబ్ సిరీస్ తో మళ్లీ రీలాంచ్ అయ్యాడు.
ఆవెబ్ సిరీస్ మంచి విజయం సాధించడంతో పర్దీన్ ఖాన్ పేరు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకాలం సినిమాలు చేయని ఎక్కడిపోయాడంటూ ఒకటే చర్చ సాగుతుంది. తాజాగా ఆసంగతులు రివీల్ చేసాడు. 'నేను సినిమాలకు దూరంగా ఉన్నది నిజమే. కానీ దేశం విడిచి వెళ్లిపోలేదు. వేరే దేశంలో ఉన్నాను. కానీ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చేసాను. దీంతో నేను కూడా లావుగా మారాను. నన్ను అలా చూసి సినిమాలు పూర్తిగా మానేసాను అనుకున్నారు.
కానీ 14 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉండి పెద్ద తప్పు చేసాననిపిస్తుంది' అని అన్నారు. అలాగే చిన్ననాటి జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'నాన్న హీరోగా ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. 1972 లో అపర్ద్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సమయంలో నిర్మాతలంతా అధిక వడ్డీకి డబ్బులు అప్పు తెచ్చి సినిమాలు చేసేవారు. అందులో నాన్న కూడా ఉన్నారు. అది చూసి మేము అంతా భయపడ్డాం.
తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. పేరుకే స్టార్ హీరో కుమారుడిని. కానీ కాలరెగరేసి చెప్పలేని పరిస్థితులుండేవి. అమ్మ ఎయిర్ ఇండియా ప్లైట్ అటెండెంట్ గా పనిచేసేంది. మా కోసం ఇద్దరు ఎంతో కష్టపడేవారు. ఏడాది కోసాసారి లాంగ్ వెకేషన్ కి తీసుకెళ్లేవారు. కొన్నిసార్లు ఆ వెకేషన్ కూడా ఆపేసారు. ఆర్దిక ఇబ్బందుల కారణంగా పుట్టినరోజులు కూడా చేసుకోలేదు. అలాగని తినడానికి తిండిలేని రోజులైతే గడపలేదు' అని అన్నారు.