మిస్ ఇండియా 2024 విజేత ఏ రాష్ట్రం నుంచి?

ఒక చిన్న నగరానికి చెందిన ఒక అమ్మాయి ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని పొందడం ఇప్పుడు ఉత్కంఠ‌ను రేకెత్తిస్తోంది

Update: 2024-10-18 03:51 GMT

ఒక చిన్న నగరానికి చెందిన ఒక అమ్మాయి ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని పొందడం ఇప్పుడు ఉత్కంఠ‌ను రేకెత్తిస్తోంది. ఈ యువ‌తి గత సంవత్సర విజేత నందిని గుప్తా నుండి కిరీటాన్ని అందుకోవడం మరింత ప్రత్యేకత‌ను ఆపాదించుకుంది. నేహా ధూపియా మిస్ ఇండియా చీరను త‌న‌కు అందించింది. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చాలా మందికి ప్రేరణగా నిలుస్తుంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన నికితా పోర్వాల్ ఈ ఏడాది విజేతగా నిలిచారు. రేఖా పాండయ్ కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఆయుషి ధోలాకియా రెండో రన్నరప్‌గా నిలిచింది. ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటం పొందిన తర్వాత నికితా పోర్వాల్ తన కుటుంబంతో అద్భుత‌ క్షణాన్ని షేర్ చేసారు. ఈ ముఖ్యమైన విజయాన్ని కుటుంబ స‌మేతంగా వారు సెల‌బ్రేట్ చేసుకున్నారు.

నికిత కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో తన విద్యను పూర్తి చేసింది. బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించింది. కళలపై ఆమెకున్న అభిరుచి, సృజనాత్మక వ్యక్తీకరణల‌పై ప్రేమ.. విద్యాసంబంధ విష‌యాల‌ను వేదిక‌పై వెల్ల‌డించింది నికితా.

Tags:    

Similar News