హృతిక్ 'ఫైటర్' 1000కోట్ల క్లబ్ గ్యారెంటీ..?
నిజానికి 'ఫైటర్' దేశభక్తి నేపథ్యంలోని సినిమా. తాజా వీడియోతో చిత్ర బృందం 2023 స్వాతంత్య్ర దినోత్సవాన్ని సినీ ప్రేక్షకులకు చాలా ప్రత్యేకంగా మార్చింది.
హృతిక్ రోషన్ కథానాయకుడిగా పఠాన్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న ఫైటర్ 2024 మోస్ట్ అవైటెడ్ చిత్రంగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని హిందీ సహా తెలుగు-తమిళం ఇతర భాషల్లో అత్యంత భారీగా విడుదల చేసేందుకు యష్ రాజ్ ఫిలింస్ సన్నాహకాల్లో ఉంది. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా చిత్రబృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్ వీడియో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.
నిజానికి 'ఫైటర్' దేశభక్తి నేపథ్యంలోని సినిమా. తాజా వీడియోతో చిత్ర బృందం 2023 స్వాతంత్య్ర దినోత్సవాన్ని సినీ ప్రేక్షకులకు చాలా ప్రత్యేకంగా మార్చింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ వీడియోని విడుదల చేయగా ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లుగా హృతిక్ రోషన్, దీపికా పదుకొనే, అనిల్ కపూర్ ఫస్ట్ లుక్‌లను ప్రదర్శించారు. ఈ వీడియో క్లిప్ రన్‌వే సన్నివేశంతో ప్రారంభమవుతుంది. G-సూట్‌లో పైలెట్ గా హృతిక్ రోషన్ ని పరిచయం చేయగా.. అతడి వెంటే దీపిక, అనీల్ కపూర్ ఇద్దరూ పైలట్ యూనిఫారంలో హెల్మెట్‌లు పట్టుకుని సన్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ గా కనిపించారు.
2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా 'ఫైటర్' విడుదల కాబోతోందని ఈ మోషన్ పోస్టర్ లో వెల్లడించారు. ఈ పోస్టర్ కి #SpiritOfFighter .. వందేమాతరం! అన్న క్యాప్షన్ ని ఇచ్చారు. ఫైటర్ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. థియేటర్లలో కలుద్దాం అని వెల్లడించారు.
హృతిక్ తండ్రి దర్శకుడు రాకేష్ రోషన్ ఈ మోషన్ పోస్టర్ పై వ్యాఖ్యానిస్తూ.. విజువల్స్ వెరీ ఇంప్రెసివ్ అని ప్రశంసించగా, దర్శకుడు జోయా అక్తర్ తన అభినందనలను తెలియజేసారు. ఎంత ఆసక్తికరంగా ఉంది? అంటూ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఫైటర్ లో కరణ్ సింగ్ గ్రోవర్ - అక్షయ్ ఒబెరాయ్ కూడా నటిస్తున్నారు. ఏరియల్ యాక్షన్ చిత్రం అయిన ఈ చిత్రం 25 జనవరి 2024న థియేటర్లలో విడుదల కానుంది. మోషన్ పోస్టర్ విడదలయ్యాక కామెంట్ల విభాగంలో అభిమానుల నుండి చాలా ప్రేమను అందుకుంటుంది. పోస్ట్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్ మొత్తం రెడ్ హార్ట్ ఎమోజీలు ఫైర్ ఎమోజీలతో నిండిపోయింది. ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఫైర్ ఎమోజీతో పాటు ''అస్సలు వేచి ఉండలేను'' అని రాశారు. ఇది ఇతిహాసం అవుతుంది అంటూ చాలామంది అభిమానులు వ్యాఖ్యానించారు.
హృతిక్ రోషన్ లేడీ లవ్ సబా ఆజాద్ కూడా ఫైర్ ఎమోజీలతో స్పందించారు. మోషన్ పోస్టర్ ఛాలెంజింగ్ గా కనిపించిందని ప్రశంసించారు. వాణి కపూర్ వంటి ఇతర ప్రముఖులు చప్పట్లు కొట్టే ఎమోజీలు రెడ్ హార్ట్ ఎమోజీని షేర్ చేసారు. అభిషేక్ బచ్చన్ కూడా తన ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తూ చేతులు పైకెత్తిన ఎమోజీలను షేర్ చేసారు. హృతిక్ రోషన్ చివరిసారిగా సైఫ్ అలీ ఖాన్ - రాధికా ఆప్టేలతో కలిసి విక్రమ్ వేద చిత్రంలో కనిపించారు. వార్ 2 లో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
ఫైటర్ హృతిక్ రోషన్ - దీపికా పదుకొనే కాంబినేషన్ ఫైటర్ తో తొలిసారి పాజిబుల్ అయింది. ఇద్దరు పరిశ్రమ టాప్ స్టార్ల కలయిక అంచనాలను పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను 2021లో సిద్ధార్థ్ ఆనంద్ ప్రకటించారు. భారతదేశంలో యాక్షన్ ఫిల్మ్ మేకింగ్‌కు అంకితమైన సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడక్షన్ హౌస్ మార్ఫ్లిక్స్ ని లాంచ్ చేస్తూ ప్రారంభించిన ఈ ప్రయత్నం వ్యక్తిగత ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. షారూఖ్ తో పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ కి పని చేసాడు. పఠాన్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్ లో చేరింది. అందుకే ఇప్పుడు ఫైటర్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.