రాజాసాబ్ ట్విస్టుల మయం

మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. కామెడీ అండ్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

Update: 2024-10-28 13:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దూకుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్ లో ఐదు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. రీసెంట్ గా కల్కి 2898 ఏడీ మూవీతో మంచి హిట్ ను అందుకున్నారు. ఇప్పుడు రాజాసాబ్ మూవీని పూర్తి చేస్తున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. కామెడీ అండ్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రాజాసాబ్ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసేశారు. వేసవి కానుకగా ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందుకు తగ్గట్లే సరైన ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే రోజు మేకర్స్.. మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

కొందరు ట్రోల్స్ చేసినా.. చాలా మంది మాత్రం మోషన్ పోస్టర్ భలేగా ఉందని తెలిపారు. షాకింగ్ లుక్ అని కామెంట్లు పెట్టారు. అదే సమయంలో సినిమాలో ప్రభాస్ మూడు రోల్స్ లో కనిపించనున్నారని ప్రచారం స్టార్ట్ అయింది. తాత, మనవడు, దెయ్యం గెటప్స్ లో ప్రభాస్ కనిపిస్తారని టాక్ వినిపించింది. తాజాగా బ్లాక్ బస్టర్ మూవీ చంద్రముఖి లాంటి ఫార్ములాను రాజాసాబ్ కు మారుతీ అప్లై చేశారని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమాలో తాత పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నారని, ప్రభాస్ కు ఆ రోల్ తో ఫ్యాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. చంద్రముఖిలోని రజినీకాంత్ మ్యేనరిజమ్స్ ను మించి డిజైన్ చేశారని తెలుస్తోంది. వెయిట్ హెయిర్ తో ఉన్న ప్రభాస్ రోలే అసలైన రాజ్ సాబ్ అంట. యంగ్ లుక్ లో ఉన్న ప్రభాస్.. సెకండాఫ్ లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పుడు ఈ అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే అవి నిజమో కాదో తెలియకపోయినా.. నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగే. మారుతి.. మామూలు ట్విస్టులు ప్లాన్ చేయడం లేదుగా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ ను చాలా కొత్తగా చూపించనున్నట్లు అర్థమవుతుందని అంటున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఫ్రెష్ కంటెంట్ ను చూపించనున్నారని అంటున్నారు. మరి రాజాసాబ్ మూవీని మారుతి ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News