ఇండస్ట్రీ ఎవరి ఎవరి సొత్తు కాదు. ఇక్కడ ఎదిగేవారు ఎదుగుతారు. పడే వారు పడతారు. పడిని వారు పడి లేస్తారు. రంగలు ప్రపంచం అన్నది ఓ మాయా ప్రపంచమైనా అద్భుతమైన వండర్ ఇదని పరిశ్రమ గురించి పూర్తిగా తెలిసిన వారు చెప్పే మాటలు. పరిశ్రమని ఆసరాగా చేసుకుని ఎదిగిన వారు ఎంతో మంది. ప్రతిభా వంతుల్ని పరిశ్రమ ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. అయితే ఇక్కడ క్రమ శిక్షణ అన్నది అత్యంత ముఖ్యం. అది ఉన్న వారు కచ్చితంగా సక్సెస్ అవుతారు అనడానికి చాలా మందిని ఉదహరించొచ్చు.
ఎదిగిన వారంతా అలా నిబద్దతతో పనిచేసిన వారే. పరిశ్రమ ఎంతో మంది హీరోల్ని...నటుల్ని..దర్శకుల్ని ..నిర్మాతల్ని మాత్రమే తయారు చేసిందా? కాదు అంతకు మించి అనాలి. ఎందుకంటే జీరో నుంచి వచ్చిన వారు ఇక్కడెలాగైనా హీరో అవ్వాలని చూస్తారు.
అది దర్శకుడిగా కావొచ్చు..హీరోగా కావొచ్చు..నిర్మాతగా కావొచ్చు. శక్తి వంచన లేకుండా శ్రమిస్తే ఫలితాలు వాటంతటే వస్తాయి అనడానికి ఎదిగిన వారిని చెప్పొచ్చు. జీరో అంటూనే సెలబ్రిటీ హోదాని ఆస్వాదించే వారెంతో మంది.
హీరో ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకుని కోట్లు సంపాదించిన వారు మరెంతో మంది. ఇవన్నీ వాళ్ల సామర్ధ్యాలు..తెలివి తేటల మీదన ఆధారపడి ఉంటాయి. ఎదుగుదల అంటే 24 శాఖల్లోనూ కాదు. ఎదగడానికి ఇక్కడ మరో ముఖ్యమైన శాఖ 25 కూడా ఉందని చెప్పాలి. హీరోలతో సన్నిహితంగా మెలుగుతూ.. వాళ్లకు కావాల్సిన వన్ని ఏర్పాటు చేస్తూ.. వాళ్ల బాగోగులు చూస్తూ... 24/7 పరిశ్రమ తో టచ్ లో ఉంటూ కొత్త అవకాశాల్ని సృష్టించుకుంటోన్న వారెంతో మంది.
ముఖ్యంగా నిర్మాతలగా ఎదిగిన వారెంతో మంది ఉన్నారు. వాళ్లలో కష్టపడే తత్వం..పనితనం మెచ్చి హీరోలు కూడా అలాంటి వాళ్లకు అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. పరిశ్రమలో ఈ సంస్కృతి ఇప్పటిది కాదు..ఎన్టీఆర్...కృష్ణ..ఏఎన్నార్ కాలం నుంచే ఉన్నదే.