ఇప్పుడా గాడ్ ఫాదర్ ఎక్కడికి వెళ్లినట్లు?
ఇటీవల సోషల్ మీడియాలో ఓ యంగ్ హీరోపై నెగిటివిటీ ఎక్కువైన సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రంపై నెగిటివ్ పీడ్ బ్యాక్ తెరపైకి వస్తోంది
ఇటీవల సోషల్ మీడియాలో ఓ యంగ్ హీరోపై నెగిటివిటీ ఎక్కువైన సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రంపై నెగిటివ్ పీడ్ బ్యాక్ తెరపైకి వస్తోంది. ఆ సినిమాకి రివ్యూలు పాజిటివ్ గా వచ్చినా! కావాలని పనిగట్టుకుని ఆ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఆహీరో వ్యక్తిత్వం గురించి కూడా కామెంట్లు వైరల్ అవుతున్నాయి. యాటిట్యూడ్ చూపిస్తున్నాడని..ఇలాంటి వాళ్లని ఎంకరేజ్ చేయకూడదంటూ కొన్ని కామెంట్లు గమనించ వచ్చు.
ఇవన్నీ ఓ ఎత్తైతే ఇప్పుడో నిర్మాణ సంస్థ కూడా తమ బాధని ఏ హీరో అర్దం చేసుకుంటాడని..మా నష్టాల పరిస్థితి ఏంటి? అంటూ కొత్త పాట అందుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఆ యంగ్ హీరో విషయంలో ఇలాంటి సన్నివేశాలు ఎదురైనప్పుడు అతన్ని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి! అన్న రేంజ్ లో కొన్నేళ్ల క్రితం ఓ నిర్మాత అండగా నిలబడ్డాడు. ఆ యంగ్ హీరో ఎదిగే క్రమంలో కూడా ఇలాంటి కొన్ని నెగిటివ్ కామెంట్లు వైరల్ అయిన సమయంలోనే ఆ నిర్మాత అండగా నేను ఉన్నానంటూ గుండె చూపించాడు.
కానీ నేడు ఆ నిర్మాత ఎక్కడా కనిపించలేదు. ఆ రోజు చూపించిన గుండె దైర్యం ఈరోజు చూపించడం లేదు. సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నా ఆ నిర్మాత ఏమీ పట్లనట్లు వ్యవహరిస్తున్నారు. ఆ హీరో ఎవరో ? తనకు తెలియదన్నట్లే సీన్ కనిపిస్తోంది. దీంతో ఆ హీరోలో కూడా ఇప్పుడు కాస్త టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తుంది. వాస్తవానికి ఈ హీరోకి ఈ మద్య కాలంలో అన్ని ప్లాప్ లే పడుతున్నాయి.
భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని సాధించడం లేదు. తాజాగా ఈ కొత్త కాంట్రవర్శీతో మరింత గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. అవకాశాల పరంగా ఢోకా లేనప్పటికీ హిట్ లేకపోతే చేతిలో అవకాశాలు చేజారే అవకాశం లేకపోలేదు. ఇండస్ట్రీలో బ్యాడ్ ఫేజ్ లో బ్యాకప్ అన్నది కీ రోల్ పోషిస్తుంది. మరి ఈ హీరో విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.