ఫస్ట్ డే 2024 లో సెంచరీ కొట్టే స్టార్లు వీళ్లేనా!
గతేడాది తొలిరోజే సెంచరీ కొట్టిన సినిమాలేవి అంటే `పఠాన్`..`లియో` కనిపిస్తున్నాయి. షారుక్ ఖాన్ నటిం చిన `పఠాన్` 106 కోట్ల వసూళ్లు ఓపెనింగ్స్ రూపంలోనే రాబట్టింది.
గతేడాది తొలిరోజే సెంచరీ కొట్టిన సినిమాలేవి అంటే `పఠాన్`..`లియో` కనిపిస్తున్నాయి. షారుక్ ఖాన్ నటిం చిన `పఠాన్` 106 కోట్ల వసూళ్లు ఓపెనింగ్స్ రూపంలోనే రాబట్టింది. అటుపై తలపతి విజయ్ నటించిన `లియో` ఏకంగా పఠాన్ రికార్డును సైతం చెరిపేసి ఏకంగా 145 కోట్ల వసూళ్లను తొలిరోజే సాధించింది. షారుక్ `జవాన్` కూడా 100 కోట్లు తెస్తుందని అంచనా వేసినా 75 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక `సలార్` సెంచరీకి చేరువలోకి వచ్చి మిస్ అయింది. ఆ సినిమా 93 కోట్లు సాధించింది.
అలాగే `యానిమల్` 63 కోట్ల వసూళ్లతో మంచి నెంబర్ సాధించింది. ఇది గత ఏడాది తొలిసారి ట్రాక్ రికార్డు మరి 2024 లో ఆ రికార్డును ఏ హీరో బ్రేక్ చేస్తాడు? అన్నది చూడాలి. ఇప్పటికే కొన్ని సినిమాలపై ఆ రకమైన అంచనాలు క్రియేట్ అవు తున్నాయి. ఓసారి ఆ సినిమాల సంగతి చూస్తే.. హృతిక్ రోషన్ నటిస్తోన్న `ఫైటర్` చిత్రంపై అంచ నాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా తొలిరోజు 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. కానీ అడ్వా న్స్ బుకింగ్స్ చూస్తుంటే మొదటి రోజు 50 కోట్లు రావడం కూడా కష్టంగానే కనిపిస్తుంది.
హృతిక్ ని మినహాయించి మిగతా ఏ హీరోలకు అంతరేజ్ ఉందంటే? ప్రభాస్..రామ్ చరణ్..ఎన్టీఆర్..బన్నీ లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ బన్నీతో `పుష్ప-2` పాన్ ఇండియాలో భారీ ఎత్తున తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండానే సంచలనాలు నమోదు చేసింది. దీంతో `పుష్ప-2` తొలి రోజు 100 కోట్లకు మించి వసూళ్లు సాధింస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక కొరటాల శివ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `దేవర`పై అంచనాల గురించి చెప్పాల్సిన పనిలేదు.
`ఆర్ ఆర్ ఆర్` తో గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయ్యాడు. దీంతో 'దేవర' తొలి రోజు 100 కోట్లు ఒపెనింగ్స్ రాబడుతుందనే అంచనాలున్నాయి. ఇక నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ `కల్కీ 2898` పై అంతకు మించి బజ్ క్రియేట్ అవుతుంది. కమల్ హాసన్ విలన్ గా నటించడం సహా చాలా మంది స్టార్ హీరోలు భాగమవ్వడంతో ఈసినిమా 200 కోట్లకు పైగానే తొలిరోజు వసూళ్లు రాబడుతుందని ట్రేండ్ అంచనా వేస్తోంది.