ఫిట్నెస్ ఫ్రీక్ ట్రెడిషనల్ వెడ్డింగ్ లుక్
భార్యాభర్తలు ఇరువురు కలిసి కొత్త యుగపు ఫిట్నెస్ పరికరాలలో పెట్టుబడి పెట్టారు.
2023లో విడుదలైన స్కూప్ చిత్రంతో కరిష్మా తన్నా పేరు మరోసారి మార్మోగింది. 2024లో మరింత బెటర్ పెర్ఫామెన్సెస్ తో ఆకట్టుకునే సమయం ఆసన్నమైంది. ఇంతలోనే కరిష్మా తన్నా భర్త వరుణ్ బంగేరాతో కలిసి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వ్యాపారంలోకి అడుగుపెట్టింది. వారి మొదటి వ్యాపార సంస్థ ప్రారంభమైంది. భార్యాభర్తలు ఇరువురు కలిసి కొత్త యుగపు ఫిట్నెస్ పరికరాలలో పెట్టుబడి పెట్టారు. ఇందుకోసం మొదటి జిమ్‌ను ముంబై- బాంద్రాలో ఏర్పాటు చేస్తున్నారు.
కరిష్మా - వరుణ్ తమ వ్యాపారం కోసం ఫిట్నెస్ పరిశ్రమను ఎంచుకోవడానికి కారణం ఈ రంగానికి పెరుగుతున్న ఆదరణ. దీని గురించి కరిష్మా మాట్లాడుతూ, ``ఈ విషయాన్ని ప్రకటించినప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. కానీ మేం ఫిట్నెస్ సంబంధిత వ్యాపారంలోకి ప్రవేశించాము. ఇది TC1 ద్వారా E.M.S ట్రైనింగ్ అనే కొత్త యుగ శిక్షణ కాన్సెప్ట్ తో వస్తోంది. . ఈ కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా స్వీకరిస్తున్న ప్రక్రియ. తక్కువ వ్యవధిలో అద్భుతమైన ఫలితాలను చూపించే ఫిట్ నెస్ విధానం ఇది. ఈ కాన్సెప్ట్‌ను మా మొట్టమొదటి వ్యాపార వెంచర్‌గా భారతదేశంలోకి తీసుకురావడానికి మేము చాలా సంతోషిస్తున్నాము`` అని తెలిపారు.
ఈ ఫోటోషూట్ వెరీ స్పెషల్ :
ఇంతలోనే కరిష్మా తన్నా స్పెషల్ మ్యాగజైన్ షూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈ కొత్త లుక్ లో పసుపు, ఆకుపచ్చ రంగు డిజైనర్ డ్రెస్ లో చాలా స్పషల్ గా కనిపిస్తోంది. కల్చర్ డ్ వెడ్డింగ్ టైటిల్ కి తగ్గట్టుగా ఎంపిక చేసుకున్న డిజైనర్ దుస్తులు ఎంతో యాప్ట్ గా కనిపిస్తున్నాయి. కరిష్మా తన్నా ఈ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇక పసుపు రంగు లాంగ్ పరికిణీపై అద్భుతమైన డిజైన్లు ఎంబ్రాయిడరీ వర్క్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.