టాలీవుడ్ ఫెస్టివల్ వీకెండ్.. ఎలా ఉంటుందో ఏంటో..

ఈ మధ్యకాలంలో సినిమాల కోసం ప్రతి ఒక్కరు ప్రైమ్ టైం కావాలని కోరుకుంటున్నారు.

Update: 2024-10-22 07:30 GMT

ఈ మధ్యకాలంలో సినిమాల కోసం ప్రతి ఒక్కరు ప్రైమ్ టైం కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా, దీపావళి. క్రిస్మస్ ఫెస్టివల్ సీజన్స్ లో సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అందరూ అదే టైంలో సినిమాలు ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని అనుకోవడంతో కాంపిటేషన్ ఎక్కువైపోతోంది. మిగిలిన వీకెండ్స్ లో మూవీస్ లేక థియేటర్స్ లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ఒకప్పుడు ఏడాది పొడువున మేగ్జిమమ్ ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో స్టార్ హీరోలు ఏడాదికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేవారు. ఇప్పుడు ఒక్క సినిమాని రిలీజ్ చేయడమే కష్టం అయిపోతుంది. ఈ దీపావళి ఫెస్టివల్ వీకెండ్ కి కూడా ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో మూడు స్ట్రైట్ తెలుగు మూవీస్ ఉన్నాయి.

కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీ “క” అక్టోబర్ 31న థియేటర్స్ లోకి వస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ కూడా రిలీజ్ కాబోతోంది. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకి రావడం విశేషం. సత్యదేవ్ ‘జీబ్రా’ మూవీ కూడా దీపావళి రేసులోనే ఉంది. వీటితో పాటు తమిళం నుంచి శివ కార్తికేయన్ ‘అమరన్’ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే వస్తోంది.

అలాగే కన్నడం నుంచి ప్రశాంత్ నీల్ కథ అందించిన ‘బఘీర’ మూవీ కూడా క్రేజీ ప్రాజెక్ట్ గా రానుంది. ఒకేసారి ఇన్ని సినిమాలు థియేటర్స్ లోకి రావడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువనే మాట వినిపిస్తోంది. ఫెస్టివల్ కి ప్రేక్షకులు మహా అయితే ఏదో ఒకటి, రెండు సినిమాలకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. ఉన్నవాటిలో ఎక్కువ బజ్ దీనిపై ఉంటే ఆ సినిమాకి ప్రయారిటీ ఇస్తాడు. మిగిలిన సినిమాల పబ్లిక్ టాక్ బట్టి ఆడియన్స్ రెస్పాన్స్ ఉంటుంది.

అలా కాకుండా ఫెస్టివల్ కి ముందు వచ్చే వీకెండ్ కి కూడా ఉపయోగించుకుంటే బాగుండేదనే మాట వినిపిస్తోంది. అక్టోబర్ 25న ‘పొట్టేల్’ అనే చిన్న సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. కంటెంట్ ఏదో నేచురాలిటీకి దగ్గరా ఉంది పాయింట్ తో ఉండబోతోందని ట్రైలర్ తో అర్ధమైంది. దీంతో కొంత బుజ్ ఉంది. అయితే ఆడియన్స్ ని ఎంత వరకు ఈ చిత్రం థియేటర్స్ వరకు రప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మిగిలిన సినిమాలు అన్ని కూడా దీపావళి ఫెస్టివల్ కి రాబోతున్నాయి.

Tags:    

Similar News