యంగ్ య‌మ సెట్లో జాన్వీ చేసిన ప‌నేంటో తెలుసా?

ఆస‌క్తిక‌రంగా ఇలాంటి ఒక ఎగ్జ‌యిట్ చేసే ప్రాజెక్ట్ తో ల‌క్కీ గాళ్ జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది

Update: 2024-07-31 05:47 GMT

యంగ్ య‌మ ఎన్టీఆర్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'దేవ‌ర‌' రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని ఇంత‌కుముందే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియన్ కేట‌గిరీలో విడుద‌ల చేసేందుకు కొర‌టాల బృందం స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. దేవ‌ర భారీ యాక్ష‌న్ డ్రామా క‌థాంశంతో రూపొందుతోంది.

ఆస‌క్తిక‌రంగా ఇలాంటి ఒక ఎగ్జ‌యిట్ చేసే ప్రాజెక్ట్ తో ల‌క్కీ గాళ్ జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈ తెలుగు సినిమాతో ద‌క్షిణాది అంత‌టా జాన్వీ ప‌రిచ‌యం అయిపోతోంది. ఈ చిత్రంలో జాన్వీ ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తోందో ఇంత‌కుముందు ఫ‌స్ట్ లుక్ రూపంలో రివీలైంది. తంగం అనే పల్లెటూరి బ్యూటీ పాత్రలో ఈ సుందరి నటిస్తోంది. సగం చీరలో జాన్వీ డి-గ్లామ్ లుక్ కొన్ని నెలల క్రితం విడుదలైంది. కుర్ర బ్యూటీ తన సహజ అందంతో అందరి హృదయాలను దోచుకుంది.

దేవర చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో జాన్వీ క‌పూర్ సెట్‌లో ఎలా ఉండేది? అంటే ఇదిగో ఈ ఫోటోగ్రాఫ్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. సెట్లో జాన్వీ చాలా సరదాగా గడిపినట్లు కనిపిస్తోంది. తాజాగా ఇన్‌స్టాలో తన అభిమానుల కోసం కొన్ని ఆహార ప‌దార్థాల ఫోటోల‌ను షేర్ చేసింది. ఇందులో బిర్యానీ, చికెన్ , శాఖాహార వంటకాలు స‌హా ఇత‌ర‌ రకాల వంటకాలను ప్ర‌ద‌ర్శిస్తూ లంచ్ టైమ్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. నేను.. ప్రేమ.. షూటింగ్ కోసం.. దేవర‌'' అని జాన్వీ పోస్ట్ చేసింది. చివర్లో ఫైర్, డ్రూలింగ్, లవ్ ఎమోజీలను కూడా జోడించింది.

దీంతో సెట్లో జాన్వీ క‌పూర్ అద‌రితో క‌లిసిపోయింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఎన్టీఆర్ స‌హా ఇతర ఆర్టిస్టులతో కలిసి జాన్వీ ప్రస్తుతం శంషాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో భారీ డ్యాన్స్ నంబర్ షూట్ లో పాల్గొంటోంది. లొకేష‌న్ లో ఇలా తార‌క్ తో క‌లిసి స్పెష‌ల్స్ అన్నీ లాగించేస్తోంద‌ని కూడా అర్థ‌మ‌వుతోంది. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

Tags:    

Similar News