ఒకే ఈవెంట్ లో మాజీ జోడీలు కానీ?
బాలీవుడ్ ఆదర్శ దంపతులుగా కీర్తింపబడ్డ హృతిక్ రోషన్-సుస్సానే ఖాన్ జోడీ గురించి తెలిసిందే.
బాలీవుడ్ సెలబ్రిటీల రిలేషన్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రేమలో ఉన్నంత కాలం కలిసి ఉండ టం..బ్రేకప్ అయితే మరోకరితో కొత్త ప్రయాణం సహజమే. ఇక వివాహం తర్వాత విడాకులు..ఆ తర్వాత మళ్లీ కొత్త జీవితం అంతా మామూలుగానే ఉంటుంది. ఆ బంధాలు..బంధుత్వాల గురించి విమర్శిం చే వాళ్లు విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ల పని వాళ్లు చేసుకుంటూనే ఉంటారు. ఇదంతా కూడా కల్చర్ లో ఓ భాగమైపోయిందిప్పుడు.
బాలీవుడ్ ఆదర్శ దంపతులుగా కీర్తింపబడ్డ హృతిక్ రోషన్-సుస్సానే ఖాన్ జోడీ గురించి తెలిసిందే. విడిపోయి చాలా కాలమవుతుంది. కొత్త వ్యక్తులతో జీవితాన్ని ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు. సుస్సాన్నే తో విడిపోయిన తర్వాత హృతిక్ రోషన్ ...సబా ఆజాద్ తో చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే. అలాగే సుస్సానే ఖాన్ కూడా ఆర్సలాన్ గోనీతో రిలేషన్ షిప్ లో ఉంది.
ఆ మాజీలిద్దరు పిల్లల భవిష్యత్ కోసం అప్పుడప్పుడు స్నేహితులుగా కలుస్తున్నారు. వాళ్ల ఆలనా పాలనా చూసి అన్ని రకాల సౌకర్యాలతో కూడిన జీవితాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ మాజీలిద్దరు ఎవరి జోడీగా వారు జంటగా ఓ ఈవెంట్ కు హాజరైనట్లు తెలుస్తోంది. హృతిక్ తన గాళ్ ప్రెండ్ సబా ఆజాద్ తో హాజర వ్వగా..సుస్సానే ఖాన్ ప్రియుడు అర్సలాన్ గోనీతో అదే ఈవెంట్ కి విచ్చేసింది.
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి రెండు జోడీలు ఒకరికొకరు తారస పడ్డారా? లేదా? అన్నది తెలియదు గానీ ఆ రెండు జంటల్నీ ఒకే పక్కకు చేర్చి నెట్టింట మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ఈ జోడీల్లో మీకు ఇష్టమైన జోడీ ఎవరో? చెప్పండి అంటూ పెద్ద కాంపిటీషన్ కే తెర తీసారు. ఇక ఇందులో సబా ఆజాద్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తుంది. స్టైలిష్ హెయిర్ స్టైల్.. పింక్ రంగు ఔట్ ఫిట్ అమ్మడిని ఆకర్షణీయంగా తీర్చి దిద్దింది. మిగతా ముగ్గురు బ్లాక్ కోడ్ లో ఈవెంట్ కి హాజరయ్యారు.