రీ రిలీజ్ సినిమాలు.. ఒకేసారి నాలుగా?

కేవలం రెండు రోజుల గ్యాప్ లోనే నాలుగు హిట్ సినిమాలని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు.

Update: 2024-09-16 04:16 GMT

టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ ని ఇప్పుడు స్టార్ హీరోల నుంచి టైర్ 2 యాక్టర్స్ వరకు అందరూ అనుసరిస్తున్నారు. గతంలో స్టార్ హీరోల హిట్ సినిమాలని మరల కొంతమంది డిస్టిబ్యూటర్స్ కొనుగోలు చేసి రీరిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్స్ నుంచి ఈ ఏడాది చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. గతంలో ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేసే స్టార్ హీరోలు కనీసం ఒక చిత్రాన్ని విడుదల చేయడం కూడా కష్టం అయిపోతుంది.

కొన్ని వీకెండ్స్ అయితే అస్సలు సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీంతో ఈ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేయడానికి రీరిలీజ్ మూవీస్ పై డిస్టిబ్యూటర్స్ ఆధారపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెలలో ఏకంగా నాలుగు సినిమాలు రీరిలీజ్ కాబోతున్నాయి. కేవలం రెండు రోజుల గ్యాప్ లోనే నాలుగు హిట్ సినిమాలని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శివాజీ' మూవీ ఉంది.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న రీరిలీజ్ చేస్తున్నారు. అలాగే రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'వెంకీ' సెప్టెంబర్ 21న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కచ్చితంగా 'వెంకీ' మరల థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయడం గ్యారెంటీ అని భావిస్తున్నారు. అలాగే సిద్ధార్ధ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'బొమ్మరిల్లు' సెప్టెంబర్ 21న థియేటర్స్ లోకి వస్తోంది.

నిర్మాతగా దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటని చెప్పొచ్చు. అలాగే శర్వానంద్, అంజలి, జై లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్న తమిళ్ డబ్బింగ్ మూవీ 'జర్నీ' సెప్టెంబర్ 21న మరల ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే ఒకేసారి ఇలా రీ రిలీజ్ చేయడం వలన ఎవరికి ప్రయోజనం ఉండదని సినీ విశ్లేషకులు అంటున్నారు. గ్యాప్ తీసుకొని ఈ చిత్రాలను రిలీజ్ చేస్తే బాగుండేదనే మాట వినిపిస్తోంది.

ప్రతి నెల పాత హిట్ సినిమాలని రీ రిలీజ్ చేస్తూ ఉంటే ప్రేక్షకులు మరల థియేటర్స్ లో వాటిని చూడడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ మధ్య కొత్త సినిమాలు సైతం ఒకేసారి థియేటర్స్ లోకి వస్తే ఏవీ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో రీరిలీజ్ సినిమాలని ఆధారిస్తారా అనేది చూడాలి.

Tags:    

Similar News