డొనాల్డ్ ట్రంప్ - పుతిన్‌లను వివాదంలోకి లాగారు!
బాలీవుడ్ లో జవాన్ హంగామాకు తెరపడింది. ఇక కొత్త విడుదలల కోసం సినీప్రియులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
బాలీవుడ్ లో జవాన్ హంగామాకు తెరపడింది. ఇక కొత్త విడుదలల కోసం సినీప్రియులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. రాబోవు వారం ఫక్రీ3, ది వ్యాక్సిన్ వార్ విడుదల కోసం అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ట్రేడ్ తో పాటు పరిశ్రమలు వచ్చే వారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఫక్రి ఫ్రాంఛైజీలో చివరి రెండు భాగాలు భారీ విజయాన్ని సాధించడంతో పార్ట్ 3 పైనా అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కామెడీ ఎంటర్ టైనర్ కి UA సర్టిఫికేట్ మంజూరు చేసింది. అయితే కొన్ని చిన్న మార్పులు చేయాలని కోరింది. ఆసక్తికరంగా ఫక్రీలో దేశాధ్యక్షుల పేర్లు వినిపిస్తున్నాయి. ఒక చోట అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితర ప్రపంచ నేతల విజువల్స్ పోస్టర్‌పై కనిపించాయి. ఈ పోస్టర్‌ను తొలగించాల్సిందిగా CBFC ఎగ్జామినింగ్ కమిటీ మేకర్స్‌ని కోరింది. మరో మార్పు `జైసే సంజు బాబా నే మక్సూద్ భాయ్ కో ఝప్పి దాలీ` అనే డైలాగ్‌కు సంబంధించినది. ఇది బహుశా మున్నా భాయ్ MBBS (2003)లో మున్నా భాయ్ (సంజయ్ దత్) ఆసుపత్రిలో మక్సూద్ (సురేంద్ర రాజన్) అనే క్లీనర్‌ను కౌగిలించుకునే సన్నివేశానికి సంబంధించినదని భావిస్తున్నారు. అదనపు వివరాలు ఇవ్వనప్పటికీ, పైన పేర్కొన్న డైలాగ్ ని సవరించాలని కట్ లిస్ట్ పేర్కొంది.
చివరగా యాంటీ స్మోకింగ్ హెల్త్ యాడ్ ప్రారంభంలో అలాగే మొదటి సగం తర్వాత జోడించారు. ఈ మార్పులు చేసిన తర్వాత సెప్టెంబర్ 20న ఫక్రి 3 నిర్మాతలకు సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు అయింది. సర్టిఫికేట్‌లో పేర్కొన్న విధంగా సినిమా నిడివి 150 నిమిషాలు. మరో మాటలో చెప్పాలంటే, ఫక్రీ 3 నిడివి 2 గంటల 30 నిమిషాలు. ఈ చిత్రానికి మృగ్దీప్ సింగ్ లాంబా దర్శకత్వం వహించారు. ఇందులో పుల్కిత్ సామ్రాట్, రిచా చద్దా, వరుణ్ శర్మ, మంజోత్ సింగ్, పంకజ్ త్రిపాఠి నటించారు. మునుపటి రెండు భాగాలు, ఫుక్రే (2013) - ఫుక్రే రిటర్న్స్ (2017) లో అలీ ఫజల్ కూడా నటించాడు. ఈ ఫ్రాంఛైజీ చిత్రాలను రితేష్ సిధ్వానీ -ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28 న పార్ట్ 3 థియేటర్లలోకి రానుంది. ఇలా దేశాధ్యక్షుల పేర్లు కూడా ఫక్రీ 3 ప్రచారానికి అక్కరకు రావడం ఆసక్తిని కలిగించే విషయమే.