రామాయ‌ణం- మ‌హాభార‌తం స్ఫూర్తి.. 500కోట్లు కొల్ల‌గొట్టేశాడు!

అనిల్ శర్మ మాట్లాడుతూ-''చాలా ఏళ్ల నుంచి గదర్ 2 చేయాల‌నే డిమాండ్ ప్ర‌జ‌ల నుంచి ఉంది. క‌థ కోసం కొట్టుమిట్టాడాం.

Update: 2023-08-15 19:21 GMT

గ‌ద‌ర్ -1 వ‌సూళ్లు 133 కోట్లు.. కేవ‌లం 18కోట్ల‌తో తెర‌కెక్కింది. గ‌ద‌ర్ -2 వారం రోజుల వ‌సూళ్లు- 200 కోట్లు. బ‌డ్జెట్ 80కోట్లు.. 20 ఏళ్ల నాటి సినిమాకి సీక్వెల్ తీసినా ప్రేక్ష‌కులు గొప్ప‌గా ఆద‌రించారు. గ‌ద‌ర్ 2 విజ‌య‌వంతంగా థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతోంది. 4రోజుల్లోనే 200కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం మ‌రో 150కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తుంద‌ని హిందీ ట్రేడ్ చెబుతోంది. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలు క‌లిపి ఫ్రాంఛైజీ 450-500 కోట్ల వ‌సూళ్ల మార్క్ ను చేరుకోనుంది. కాలం మ‌ర్చిపోయిన స‌న్నీడియోల్ నుంచి ఈ స్థాయి వ‌సూళ్లు అంటే హిట్టు సినిమా సీక్వెల్ క్రేజ్ అని చెప్పాలి. ఆస‌క్తిక‌రంగా ఈ రెండు సినిమాల‌కు రామాయ‌ణం - మ‌హాభార‌తం స్ఫూర్తి ఉండ‌నే ఉంది.

గదర్ 2 బ్లాక్‌బస్టర్ ని పురస్కరించుకుని ఈరోజు ముంబైలో చిత్ర‌బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ స‌క్సెస్ మీట్ లో ద‌ర్శ‌కుడు టాప్ సీక్రెట్ ని రివీల్ చేసారు. గదర్ - ఏక్ ప్రేమ్ కథ (2001) రామాయణం నుండి ప్రేరణ పొందిందని, గదర్ 2లో మహాభారత ప్రస్తావన ఉందని దర్శకుడు అనిల్ శర్మ వెల్లడించారు. సీక్వెల్ కి మహాభారతంలోని అభిమన్యు ఎపిసోడ్ స్ఫూర్తినిచ్చింద‌ని అనిల్ శర్మ వెల్లడించారు.

అనిల్ శర్మ మాట్లాడుతూ-''చాలా ఏళ్ల నుంచి గదర్ 2 చేయాల‌నే డిమాండ్ ప్ర‌జ‌ల నుంచి ఉంది. క‌థ కోసం కొట్టుమిట్టాడాం. కానీ సరైన కథ లభించ లేదు. శక్తి జీ (రచయిత శక్తిమాన్) కోయ్ ఐడియా దే డూ అని చెప్పాను. ఆ తర్వాత నవరాత్రి సమయంలో శక్తి జీ నా ఇంటికి వచ్చి గదర్ 2 కోసం ఒక ఆలోచనను చెప్పాడు. ఉన్‌హోనే కహా, ప్రసాద్ మైన్ దేతా హూన్ ఆప్కో!'' అని అన్నాడు. నేను పూర్తి కథ విన్నాను. ఆ క‌థ‌లో భావోద్వేగం నాకు చాలా న‌చ్చింది. గదర్ మొదటి భాగం నిజానికి రామాయణం స్ఫూర్తితో తీసిన‌ది. రామ్ సీతా కో లంకా సే లేనే జాతే హై... అప్పుడు నేను ''హమారీ ఫిల్మ్ రామాయణ్ హై. ఫ్లాప్ నహీ హో శక్తి'' అని అత‌డితో వ్యాఖ్యానించాను అని తెలిపారు.

''నేను గ‌ద‌ర్ సీక్వెల్ క‌థ‌ విన్నాను. అగర్ అభిమన్యు చక్రవ్యూహ మే ఫసా థా ఔర్ ఉస్ వక్త్ అర్జున్ పహుచ్ జాతా, తో మహాభారత్ తో వహిన్ ఖతం హో జాతా. ఇస్సే బడా ఎమోషన్ తో సన్సార్ మే నహిం హై. ఈ కథ విఫలం కాదు'' అని అన్నాను. నేను కథ విని ఏడ్చాను.

ఈ కథను సన్నీ డియోల్ సర్‌కి చెప్పాను. ఇంకీ మోతీ మోతీ ఆంఖేన్ హై. వెంటనే ఇంకా ఎమోషన్ దిఖ్ జాతా హై! షరీక్ సర్ (షారీక్ పటేల్) కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. పునీత్ (గోయెంకా) కూడా ఎమోష‌న‌ల్ అయ్యారు'' అని తెలిపాడు. మేమంతా ఆడియెన్ లో ఎమోష‌న్ చూస్తామ‌ని న‌మ్మాం.. అని అన్నారు.

అనిల్ శర్మ చేసిన అభిమన్యు సూచన 'గదర్ 2'కి బాగా వ‌ర్క‌వుటైంది. అందులో తారా సింగ్ (సన్నీ డియోల్)ని కనుగొనడానికి జీతే (ఉత్కర్ష్ శర్మ) పాకిస్తానీ జైలులోకి చొరబడినప్పుడు క‌థ‌ మలుపు తిరుగుతుంది. కానీ జైలు నుంచి బయటకు రాలేక అత‌డు పట్టుబడతాడు. గదర్ - ఏక్ ప్రేమ్ కథ 20వ వార్షికోత్సవం ప్రత్యేక ఇంటర్వ్యూలో అనిల్ శర్మ ఇలా అన్నారు. ''మేము రామాయణం నుండి ప్రేరణ పొంది మొద‌టి భాగం తీసాము. భగవాన్ రామ్ జో హై, వో సీతా కో లేనే లంకా జాతే హై ఔర్ లువ్ ఔర్ కుష్ కెహతే హై కి “మేరీ మా కో వాపిస్ లాయియే”! ఈ కథను దేశవ్యాప్తంగా పిల్లలు ఇష్టపడతారని నాకు తెలుసు. పిల్ల‌లు పెద్ద‌లు అంద‌రి హృదయాలను తాకుతుంది. గదర్ - ఏక్ ప్రేమ్ కథా రామాయణం కా హి దస్రా రూప్ హై. ఇంటర్వెల్ పాయింట్‌లో మీరు గమనించారా? పుష్పక విమానంలో రావణుడు సీతను ఎలా అపహరించాడో అలానే విల‌న్ అమ్రీష్ పూరి నేరుగా అమీషా పటేల్‌ను విమానంలో పాకిస్తాన్‌కు తీసుకెళ్తాడు! అని రామాయ‌ణం స్ఫూర్తి గురించి వెల్ల‌డించారు.

Tags:    

Similar News