గేమ్ ఛేంజర్.. పెద్ద స్కెచ్చే ఇది..!

నేషనల్ వైడ్ గానే కాదు యూఎస్ లో కూడా ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Update: 2025-01-08 04:51 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. 20 ఏళ్ల కెరీర్ లో దిల్ రాజు నిర్మించిన హైయ్యెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. శంకర్ మార్క్ గ్రాండియర్ తో పాటు ఆయన ఒకప్పటి సినిమాల్లో ఉండే సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉందని తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రాబోతున్న రెండు సినిమాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. నేషనల్ వైడ్ గానే కాదు యూఎస్ లో కూడా ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

ఐతే స్టార్ సినిమా రిలీజ్ ముందు ఉండాల్సిన హంగామా హడావిడి గేమ్ ఛేంజర్ కి కనిపించట్లేదు. ఈమధ్య ప్రెస్ మీట్ లో దిల్ రాజు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. మేము చేసేది చేస్తున్నామని అన్నారు. ఐతే గేమ్ ఛేంజర్ సినిమాను ఇంత లో ప్రొఫైల్ ప్రమోషన్స్ చేయడానికి బలమైన రీజన్ ఉందని తెలుస్తుంది. సినిమా మీద భారీగా అంచనాలు పెంచి ఒకవేళ ఆ అంచనాలను అందుకోకపోతే సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తుంది. అందుకే గేం ఛేంజర్ సినిమాను చాలా తక్కువ ప్రమోషన్స్ చేస్తున్నారట.

ఇదంతా మేకర్స్ వేసిన పెద్ద స్కెచ్ లో భాగమే అని తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుందని అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ ఆ యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. మరోపక్క ప్రీ క్లైమాక్స్ కూడా సినిమాకు బలమని తెలుస్తుంది. పొలిటికల్ ట్విస్ట్ తో గేమ్ ఛేంజర్ లో ఆ సీన్స్ కూడా మేజర్ హైలెట్ అవుతాయని తెలుస్తుంది.

వీటితో పాటు సినిమాలో ప్రతి సాంగ్ కోట్లు ఖర్చు పెట్టి తీశారు కాబట్టి అది కూడా బాగా వర్క్ అవుట్ అయ్యేలా ఉన్నాయని అనిపిస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ ని కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తారని అంటున్నారు. రాం చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో కియరా గ్లామర్, థమన్ మ్యూజిక్, హీరో విలన్ సీన్స్ ఇక చరణ్ డ్యుయల్ రోల్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ హైలెట్స్ గా చెప్పుకుంటున్నారు. అంతేకాదు మాస్టర్ క్లాస్ డైరెక్టర్ శంకర్ ని అసలు తక్కువ అంచనా వేయలేం. సో గేమ్ ఛేంజర్ బజ్ కాస్త తక్కువగానే ఉన్నా రిలీజ్ తర్వాత సినిమా రేంజ్ ఏంటన్నది తెలుస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News