సీడెడ్ రికార్డ్స్‌లో రామ్ చరణ్ స్టామినా!

ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ఈ చిత్రం తన స్థాయిని ప్రదర్శించగలిగింది.

Update: 2025-01-11 08:27 GMT

రామ్ చరణ్ హీరోగా పాత్రలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే, సినిమా టాక్ మాత్రం అనుకున్నంత పాజిటివ్‌గా రాలేదు. కథ, సన్నివేశాల ప్రాధాన్యతలో కొంత రొటీన్ గా కనిపించినప్పటికీ, సినిమా కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి రికార్డులు నమోదు చేసింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ఈ చిత్రం తన స్థాయిని ప్రదర్శించగలిగింది.

సీడెడ్ ఏరియాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అడ్వాన్స్ బుకింగ్స్. రామ్ చరణ్ యొక్క స్టార్ పవర్‌ వల్ల సినిమా మొదటి రోజునే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. యాక్షన్, ఎమోషన్, పొలిటికల్ డ్రామా కలగలసిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఎంతమాత్రం వెనుకాడలేదు. దానికి తోడు నిర్మాత దిల్ రాజు రిలీజ్ స్ట్రాటజీ ప్రమోషన్స్ కూడా చాలా హెల్ప్ చేశాయి.

ఇక మొదటి రోజున సీడెడ్‌లో రూ. 5.64 కోట్లు వసూలు చేయడం ద్వారా రామ్ చరణ్ తన మార్కెట్ స్థాయిని మరోసారి రుజువు చేసుకున్నారు. ఇటీవల కాలంలో విడుదలైన పెద్ద సినిమాల్లో సీడెడ్ కలెక్షన్లను పరిశీలిస్తే, గేమ్ ఛేంజర్ మొదటి రోజు వసూళ్లు ఇతర సినిమాలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, ఫ్యాన్స్‌లో ఆసక్తిని కొనసాగిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తో వచ్చిన ఈ వసూళ్లు రాబోయే రోజుల్లో మరింత మెరుగుపడతాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటివరకు కల్కి 2898AD, దేవర, పుష్ప ది రూల్ వంటి సినిమాలు సీడెడ్‌లో భారీ వసూళ్లు సాధించాయి. ఈ జాబితాలో గేమ్ ఛేంజర్ కూడా స్థానం సంపాదించింది. రామ్ చరణ్ తన నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగారు. అయితే టాక్ మాత్రం సెకండ్ డే ఎఫెక్ట్ చూపించేలా ఉంది. రెండవ రోజు దేవర లాంటి మ్యాజిక్ జరిగితే తప్ప ప్రాఫిట్స్ లోకి రావడం కష్టమే. వీకెండ్ కలిసొస్తే మాత్రం ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే అవకాశముంది.

సీడెడ్ ఏరియాలో ఇటీవల వచ్చిన పెద్ద సినిమాల మొదటి రోజు కలెక్షన్లు

1. కల్కి 2898AD: 5.10 కోట్లు

2. దేవర: 10.3 కోట్లు

3. పుష్ప ది రూల్: 10.2 కోట్లు

4. గేమ్ ఛేంజర్: 5.64 కోట్లు

Tags:    

Similar News